నానితో నందమూరి హీరో..?
హీరోగా సక్సెస్ సాధించేందుకు కష్టపడుతున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అదే సమయంలో నిర్మాతగానూ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు తాను హీరోగా చేస్తున్న సినిమాలను మాత్రమే నిర్మిస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ కిక్ 2తో తొలిసారిగా ఓ బయటి హీరోతో సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈసినిమా రిజల్ట్ కళ్యాణ్ రామ్ను కష్టాల్లో పడేసిందే.
కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాను నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. అంతేకాదు నిర్మాతగా ఇతర హీరోలతో వరుస సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా వరుస సక్సెస్ లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నానితో సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని. దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న ఎమ్సీఏ తో పాటు హను రాఘవపూడి, మేర్లపాక గాంధీ లాంటి దర్శకులతో సినిమాలకు అంగీకరించాడు. ఇవన్నీ పూర్తయి కళ్యాణ్ రామ్ బ్యానర్ సినిమా పట్టాలెక్కాలంటే చాలా సమయమే పడుతుంది. మరి ఈసినిమాకు దర్శకుడిగా ఎవరి ఫైనల్ చేస్తాడో చూడాలి.