ఈ రావణున్ని చంపాలంటే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెంచేశాయి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా తొలి టీజర్ను చిత్రయూనిట్ విడుదల చేశారు. సినిమాలోని జై క్యారెక్టర్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.
ఎన్టీఆర్ మాస్ లుక్ లో నెగెటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. రావణుడిగా ఎన్టీఆర్ సూపర్బ్ అనిపించాడు.. ఆ రావణున్ని దాటాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణున్ని చంపాలంటే సముద్రమంతా ధైర్యముండాలా.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులను ఖుషీ చేస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈసినిమాలో నివేథా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.