'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ! | Jai Lava Kusa Twitter reviw | Sakshi
Sakshi News home page

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

Published Thu, Sep 21 2017 11:42 AM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM

Jai Lava Kusa Twitter reviw



జూనియర్‌ ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో తెరకెక్కిన తాజా సినిమా 'జై లవకుశ'.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తొలిసారి మూడు విభిన్నమైన పాత్రలను పోషించాడు. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై నెటిజన్ల నుంచి పాజిటివ్‌ కామెంట్‌ వస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులైతే ఈ సినిమా సూపర్‌హిట్‌ ఖాయమని ట్వీట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఓవర్సీస్‌లో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్‌ మౌత్‌టాక్‌తో, పాజిటివ్‌ రివ్యూలతో 'జైలవకుశ' సినిమా ప్రారంభం కావడం చిత్రయూనిట్‌లో సంతోషం నింపుతోంది.

'జైలవకుశ' ముగ్గురు అన్నదమ్ముల స్టోరీ. ఇందులో జై, లవ, కుశగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్‌ ఎలాంటి డూప్‌ లేకుండా నటించాడు. చిన్నతనంలో కలిసి పెరిగిన ముగ్గురు అన్నదమ్ములు కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అందులో లవ బ్యాంక్‌ మేనేజర్‌ అయితే, కుశ అల్లరిగా పెరిగి దొంగగా మారతాడు. ఇక సినిమాకు అత్యంత కీలకమైన 'జై' చిన్నప్పుడు తన సోదరుల నుంచే వేరు అయి.. ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన రౌడీగా మారతాడు. ఈ ముగ్గురు తిరిగి ఎలా కలిశారు? రావణాసురుడిని ఇష్టపడే 'జై' ప్రతినాయకుడి స్వభావం నుంచి మారిపోతాడా? సోదరుల కోసం 'జై' చేసిన త్యాగమేమిటి? అన్నది తెరపై చూడాలంటున్నారు నెటిజన్లు.



ఇక ఈ సినిమాకు ఉదయం నుంచే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ, రకుల్‌ప్రీత్‌సింగ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు 'జైలవకుశ' సూపర్‌హిట్‌ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. ఎన్టీఆర్‌ నటన అద్భుతం.. సూపర్‌హిట్‌ ఖాయమంటూ ట్వీట్లు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement