ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ కాపీ చేశాడా..? | Director Puri Hurt with Jai Lava Kusa Jai Character | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ కాపీ చేశాడా..?

Published Sun, Jul 9 2017 3:17 PM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ కాపీ చేశాడా..?

ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ కాపీ చేశాడా..?

ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు వివాదాస్పదమవుతున్నాయి. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో ఏదో ఒక కారణంతో చిక్కుల్లో పడుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సినిమాపై ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా విషయంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అసంతృప్తి వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది.

టెంపర్ సినిమా సక్సెస్ తరువాత ఎన్టీఆర్తో మరో సినిమా చేయాలని భావించిన పూరి, ఓ క్యారెక్టర్ను ఎన్టీఆర్కు వినిపించాడట. అయితే అప్పట్లో పూరి సినిమాకు నో చెప్పిన ఎన్టీఆర్.. అదే క్యారెక్టర్ను జై లవ కుశ సినిమా కోసం కాపీ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన జై టీజర్ చూసిన పూరి, ఇది తాను సృష్టించిన క్యారెక్టర్ అని తన పర్మిషన్ లేకుండా ఆ క్యారెక్టరైజేషన్ కాపీ చేశాడని ఫీల్ అవుతున్నాడట. మరి ఈ వార్తలపై జై లవ కుశ టీం ఎలా స్పంధిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement