
జై లవ కుశ సక్సెస్ తో ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన యంగ్ టైగర్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. దసర పండుగను ముందుగానే తీసుకువచ్చిన ఎన్టీఆర్, ఘనవిజయాన్ని అందుకున్నాడు. తన కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది జై లవ కుశ. కలెక్షన్లతో పాటు సినీ ప్రముఖుల నుంచి ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా జై లవ కుశ సినిమా చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందించారట. అంతేకాదు డిన్నర్ ఆహ్వానించి స్వయంగా కలిసి ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపాడు చెర్రీ. ఈ సందర్భంలో ఎన్టీఆర్, చరణ్ లు కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలోనూ పలు సందర్భాల్లో తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్ పేరు చెప్పిన చరణ్ ఇప్పుడు స్వయంగా అభినందించటం పై ఇద్దరు హీరోల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
I'm really touched by the way the fans are reacting to a genuine gesture by Ramcharan.. Tarak also equally touched.. We are ONE .. TFI 👍 pic.twitter.com/FyVIohKoVG
— kona venkat (@konavenkat99) 29 September 2017