నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది : ఎస్‌ఎస్‌ రాజమౌళి | Tarak.. my heart is swelling with immense pride, says rajamouli ss | Sakshi
Sakshi News home page

జైలవకుశ: నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది!

Published Thu, Sep 21 2017 2:08 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది: రాజమౌళి - Sakshi

నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది: రాజమౌళి

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో తెరకెక్కిన తాజా సినిమా 'జై లవకుశ'.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తొలిసారి మూడు విభిన్నమైన పాత్రలను పోషించాడు. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై నెటిజన్ల నుంచి పాజిటివ్‌ కామెంట్‌ వస్తోంది.

మూడు పాత్రల్లో ఎన్టీఆర్‌ అద్భుతమైన నటన కనబర్చాడని, ముఖ్యంగా 'జై' పాత్రలో ఎన్టీఆర్‌ చక్కని వైవిధ్యాన్ని చూపించాడని ప్రేక్షకులు మెచ్చుకుంటున్న నేపథ్యంలో ప్రఖ్యాత దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ట్విట్టర్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'జైలవకుశ' సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. 'తారక్‌.. నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. మాటలు రావడం లేదు. జై.. జై.. జైలవకుశ' అంటూ జక్కన్న ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement