ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్ | NTR express his happyness about Bigboss great success | Sakshi
Sakshi News home page

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

Published Mon, Sep 18 2017 9:48 AM | Last Updated on Mon, Jun 18 2018 8:04 PM

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్ - Sakshi

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

సాక్షి, హైదరాబాద్ : యంగ్‌టైగర్‌, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ నగరంలో సందడి చేసారు. ఆదివారం ఇమామీ సంస్థ పార్క్‌ హోటల్‌లో నిర్వహించిన ‘జూనియర్‌ ఎన్టీఆర్‌తో మీరు’ పోటీ విజేతలతో ఆయన సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆయన తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన మూవీ జై లవ కుశ. అందులో తనకు జై పాత్ర అంటే చాలా ఇష్టమని ఎన్టీఆర్ చెప్పారు. మరిన్ని విశేషాలు తారక్‌ మాటల్లోనే..

‘ఈ వారంలో విడుదల కానున్న ‘జై లవకుశ’  చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. తుంటరితనం, మంచితనం, రాక్షసత్వం కలగలిపిన మూడు పాత్రలు ఈ చిత్రంలో పోషించా. అందులో జై పాత్ర అంటే చాలా ఇష్టం. ఈ చిత్రం నా తల్లిదండ్రులకు, అభిమానులకు సంతోషం పంచడానికే చేశా. సినిమా ఫలితం ఎలా ఉన్నా మా అన్నదమ్ముల అనుబంధంలో ఎలాంటి తేడా ఉండదు. సోషల్‌ మీడియా ఓ ఉబి లాంటిది. ఇతరులు మన జీవితంలోకి తొంగిచూసే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి.

నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతిపెద్ద తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’  అనుకున్నదానికంటే ఘన విజయం సాధించింది. ఇంతటి విజయాన్ని నేను కూడా ఉహించలేదు. హిందీషోతో పోలిస్తే మన తెలుగులో ఎలాంటి గొడవలు, కలహాలు లేకుండా సాఫీగా సాగుతంది. అసలు సహనం అనేది మన రక్తంలోనే ఉంది. షోలో పార్టిసిపెంట్లు అందరూ నా ఫేవరెట్లే. వీరిని షో నుంచి బయటకు పంపడంలో నా సొంత నిర్ణయం ఏం ఉండదు. అంతా ఓటింగ్‌ ద్వారా జరుగుతుంది’ అంటూ ఎన్టీఆర్ పలు విషయాలను షేర్ చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement