మెగా రికార్డును బద్దలు కొడతాడా..! | Will Jr NTRs Jai Lava Kusa beat Chirus record | Sakshi
Sakshi News home page

మెగా రికార్డును బద్దలు కొడతాడా..!

Published Tue, Oct 17 2017 10:50 AM | Last Updated on Tue, Oct 17 2017 10:50 AM

Jai Lava Kusa Khaidhi No 150

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై లవ కుశ. తారక్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లు సాదిస్తున్న జై లవ కుశ, త్వరలోనే మెగా రికార్డ్ ను బ్రేక్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. కలెక్షన్ల విషయంలో బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా నాన్ బాహుబలి లిస్ట్ లో మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 టాప్ లో ఉంది.

ఓవరాల్ గా 164 కోట్ల గ్రాస్ సాధించిన చిరంజీవి సినిమా మొత్తం మీద మూడో స్థానంలో నాన్ బాహుబలి లిస్ట్ లో టాప్ ఉంది. అయితే ఎన్టీఆర్ జై లవ కుశ ఇప్పటి వరకు 162 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో మంచి వసూళ్లు సాదిస్తుండటంతో బిజినెస్ ముగిసేనాటికి ఖైదీ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. కొంత మంది ఫ్యాన్స్ నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ మెగా రికార్డ్ ను బీట్ చేశాడన్న వాదన కూడా వినిపిస్తోంది. అసలు లెక్క తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement