
అదే టైటిల్!
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 27వ చిత్రానికి ప్రచారంలో ఉన్న ‘జై లవకుశ’ పేరునే టైటిల్‌గా ఖరారు చేశారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేశారు.
నందమూరి తారక రామారావు చేసిన ‘లవకుశ’ తెలుగు తెరపై చరిత్ర సృష్టించింది. రూపంలో, నటనలో తాతయ్యను గుర్తు చేస్తుంటారు మనవడు ఎన్టీఆర్. ‘లవకుశ’ పేరుకి ముందు ‘జై’ అక్షరాన్ని జోడించి మనవడు ఈ సినిమా చేస్తుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా రాశీఖన్నా, ప్రత్యేక పాత్రలో హంసా నందిని నటిస్తున్నారు. ఇందులో మొత్తం ముగ్గురు కథానాయికలు ఉంటారట. ఇంకా ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.