నేరం చేయాలనుకుంటే ఆమెతో కలిసి చేస్తా! | Tamannaah Said My Crime Partner is Srurthi | Sakshi
Sakshi News home page

నేరం చేయాలనుకుంటే ఆమెతో కలిసి చేస్తా!

Published Sat, Feb 23 2019 11:38 AM | Last Updated on Sat, Feb 23 2019 11:38 AM

Tamannaah Said My Crime Partner is Srurthi - Sakshi

సినిమా: ఒక వేళ నేను నేరం చేయాలనుకుంటే అందుకు భాగస్వామిగా ఎవరిని చేర్చుకుంటానో తెలుసా? అని అంటోంది నటి తమన్నా. ఒకప్పుడు హీరోయిన్ల మధ్య ఈర్షా్యద్వేషాలు అధికంగా ఉండేవంటారు. అంటే స్నేహితులుగా ఉన్న వారు లేరా? అంటే ఉండేవారు కానీ, తక్కువ అనే సమాధానమే వస్తోంది. అలాంటిది ఈ తరం హీరోయిన్లు అంతరంగంలో ఎలా ఉన్నా, బాహ్యప్రపంచంలో మాత్రం స్నేహాంగానే ఉంటున్నారు. ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా, సహజ నటి శ్రుతిహాసన్‌పై స్నేహాన్ని తెగ పంచేస్తోంది. చాలా కాలం తరువాత ఈమె నటించిన తమిళ చిత్రం కన్నే కలైమానే శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో తన పాత్ర చాలా విభిన్నంగా, చాలా బలమైనదిగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న నటి తమన్నా ఇంకా పలు విషయాలను పంచుకుంది. తాను తెలుగు, కన్నడం భాషల్లో పలు చిత్రాలు చేస్తున్న కారణంగా తమిళంలో ఎక్కువ చిత్రాలను అంగీకరించలేని పరిస్థితి అని చెప్పింది.

అయితే ఇకపై తమిళ చిత్రాలపై అధిక దృష్టి పెడతానని పేర్కొంది. అదే విధంగా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పింది. ఇకపోతే నటి శ్రుతిహాసన్‌ అంటే తనకు చాలా ఇష్టం అని, తాను ఒక వేళ ఏదైనా నేరం చేయాలనుకుంటే దాన్ని శ్రుతిహాసన్‌ను భాగస్వామిగా చేసుకుని చేస్తానని చెప్పింది. మరో విషయం ఏమిటంటే తాను శ్రుతిహాసన్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నానని, దర్శక, రచయితలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ కోసం మంచి కథను సిద్ధం చేస్తారని ఆశిస్తున్నానని అంది. తమ కాంబినేషన్‌లో ఒక చిత్రం చేయాలని ఆశగా ఉందని తమన్న పేర్కొంది. చాలా గ్యాప్‌ తరువాత నటి శ్రుతిహాసన్‌ ఇటీవలే మళ్లీ నటనపై దృష్టి పెట్టింది. తమన్నా ఆకాంక్షలకు ఈ అమ్మడు ఎలా రియాక్ట్‌ అవుతుందో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement