Buzz: Tamannaah Bhatia Will Act In Senior Actress Jamuna Biopic - Sakshi
Sakshi News home page

Jamuna Biopic: జమున బయోపిక్‌లో నటించనున్న తమన్నా!

Published Sat, Jan 28 2023 8:23 AM | Last Updated on Sat, Jan 28 2023 9:13 AM

Buzz: Tamannaah Bhatia in Senior Actress Jamuna Biopic - Sakshi

దివంగత ప్రఖ్యాత నటీమణి జమున బయోపిక్‌లో మిల్కీబ్యూటీ తమన్న నటించనున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్‌లో అలాంటి అవకాశం ఉందనే సమాధానం వస్తోంది. ప్రఖ్యాత నటీమణుల జీవిత చరిత్రతో చిత్రాలు తెరకెక్కించడం సాధారణ విషయమే. ఇంతకుముందు నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన మహానటి చిత్రంలో కీర్తిసురేశ్‌ టైటిల్‌ పాత్రను పోషించారు. సావిత్రి పాత్ర పోషించిన కీర్తీసురేశ్‌కు సినీ ప్రముఖుల అభినందనలు దక్కడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.

అదేవిధంగా ప్రముఖ శృంగార తార సిల్క్‌స్మిత బయోపిక్‌ హిందీలో ది డర్టీ పిక్చర్స్‌ పేరుతో రూపొందించారు. సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్‌ నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే ప్రఖ్యాత నటి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన తలైవి చిత్రంలో బాలీవుడ్‌ సంచలన నటి కంగనారనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

తాజాగా ప్రఖ్యాత నటీమణి జమున జీవిత చరిత్రను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటి జమున తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 190 చిత్రాలకు పైగా నటించారు. ఈ బయోపిక్‌లో హీరోయిన్‌ తమన్నా జమున పాత్రను పోషించనుందట. కథ విన్న వెంటనే ఆమె అంగీకరించినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

చదవండి: కూతుర్ని హీరోయిన్‌గా చూడాలనుకున్న జమున

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement