
నీకు ఎన్ని చాక్లెట్లు కావాలి? అంటే, ‘వన్ నుంచి టెన్ వరకు’ ఏ నంబర్ అయినా చెబుతారు కానీ, పొరపాటున ఆ నంబర్ మాత్రం చెప్పరు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీకీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఏడు చాక్లెట్స్ ఇచ్చి, ఇంకోటి ఇస్తానంటే ఒప్పుకోరు. పోనీ తొమ్మిదికి ఒకటి తగ్గిస్తానన్నా ‘ఊహూ’ అంటారు. ఎందుకంటే ఏడుకి, తొమ్మిదికి మధ్య ఉన్న ‘ఎనిమిది’ తమన్నా అన్‌లక్కీ నంబర్. చాక్లెట్స్‌కి కూడా లక్కీ నంబర్ చూడాలా అనుకుంటున్నారా? ఎనిమిది అంటే తమన్నాకు ఇష్టం ఉండదని చెప్పడానికి ఓ ఉదాహరణ అంతే.
ఎనిమిదిని ఎందుకు అన్‌లక్కీ నంబర్‌గా భావిస్తారో తమన్నా స్పష్టం చేయలేదు. సో.. ఈ బ్యూటీని ఆరాధించేవారు పండ్లూ, పూలూ, వేరే ఏదైనా తీసుకెళ్లేటప్పుడు టోటల్‌గా నంబర్ ఎనిమిది లేకుండా చూసుకుంటే చాలు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా తన అన్‌లక్కీ నంబర్‌ని బయటపెట్టారు. ఇంకా తను ఫుడ్ లవర్‌ని అని, షూటింగ్‌కి పేకప్ చెప్పాక అందరి అమ్మాయిల్లా మామూలుగా ఉంటానని, తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ సినిమా ఇండస్ట్రీ బయటివారే అని చెప్పారు.