Chiranjeevi Bhola Shankar Movie 2nd Song Promo Released, Video Inside - Sakshi
Sakshi News home page

Bhola Shankar Movie Songs: చిరంజీవి 'జామ్‌ జామ్‌ జజ్జనక' కోసం రెడీగా ఉండండి

Published Mon, Jul 10 2023 3:15 AM | Last Updated on Mon, Jul 10 2023 9:41 AM

Bhola Shankar Movie 2nd Song Promo Release - Sakshi

‘జామ్‌ జామ్‌ జామ్‌ జామ్‌ జజ్జనక.. తెల్లార్లు ఆడుదాం తైతక్క..’ అంటూ చిందేశారు చిరంజీవి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’. ఈ మూవీలో తమన్నా కథానాయికగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘జామ్‌ జామ్‌ జజ్జనక...’ అంటూ సాగే రెండో పాట ప్రోమోని ఆదివారం విడుదల చేసింది చిత్రయూనిట్‌.

ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన  పోస్టర్‌లో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి సూపర్‌ కూల్‌గా కనిపిస్తున్నారు. ‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘భోళా శంకర్‌’. ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భోళా మానియా...’ అనే మొదటి పాట చార్ట్‌ బస్టర్‌గా నిలిచింది. ‘జామ్‌ జామ్‌ జజ్జనక...’ అంటూ సాగే పూర్తి పాటని ఈ నెల 11 విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. కీర్తీ సురేష్, సుశాంత్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి, కెమెరా: డడ్లీ, లైన్‌ ప్రొడక్షన్‌: మెహెర్‌ మూవీస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement