Watch: Rajinikanth And Tamannaah Bhatia Jailer Movie First Song Kaavaalaa Out - Sakshi
Sakshi News home page

Jailer Kaavaalaa Song: నువ్వు కావాలయ్యా అంటూ దుమ్ములేపిన తమన్నా

Published Fri, Jul 7 2023 3:51 AM | Last Updated on Fri, Jul 7 2023 11:00 AM

Rajinikanth and Tamannaah Bhatia Jailer First song out - Sakshi

కొంచెం ఆట కావాలా? కొంచెం పాట కావాలా? అంటూ ఊర మాస్‌ స్టెప్పులతో తమన్నా అదరగొట్టారు. రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘జైలర్‌’లోని ‘నువ్వు కావాలయ్యా..’ అంటూ సాగే పాట ఇది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. ‘జైలర్‌’ చిత్రం ఆగస్టు 10న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను గురువారం విడుదల చేశారు.

రజనీకాంత్, తమన్నా మధ్య ఈ పాట సాగుతుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరపరచిన ఈ పాటకు అరుణ్‌ రాజా కామరాజ్‌ సాహిత్యం అందించగా శిల్పా రావు, అనిరుధ్‌ పాడారు. జానీ మాస్టర్‌ ఈ పాటకు నృత్య రీతులు సమకూర్చారు. ‘జైలర్‌’లో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్‌ కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement