
ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వరం జయంత్ కుమార్ ఈ చిత్రాన్ని శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. వరం జయంత్ కుమార్ మాట్లాడుతూ – ‘‘లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ మా చిత్రంలో ఉన్నాయి. ఆర్య హీరోగా నటిస్తూ, స్వయంగా తమిళ్‌లో నిర్మించిన చిత్రమిది. అక్కడ మంచి విజయం సాధించింది.
తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన చిత్రం కావడంతో తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. డి. ఇమాన్ పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటలు, ట్రైలర్ సినిమాపై క్రేజ్‌ని పెంచాయి. ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ రాకూడదనే చాలా క్వాలిటీగా డబ్బింగ్ చేయించాం. సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి, సినిమా బావుందంటూ ప్రశంసించడంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment