ఎవరైనా ఉంటే చెప్పండి | Tamanna Compleat 13 Years in Her Movie Journey | Sakshi
Sakshi News home page

ఎవరైనా ఉంటే చెప్పండి

Published Tue, Jan 8 2019 11:58 AM | Last Updated on Tue, Jan 8 2019 11:58 AM

Tamanna Compleat 13 Years in Her Movie Journey - Sakshi

సినిమా: మీ ఊళ్లో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే చెప్పండి పెళ్లి చేసుకుంటానని అంటోంది నటి తమన్నా. నటిగా ఈ అమ్మడి వయసు 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కాలంలో హింది, తెలుగు, తమిళం, కన్నడం అంటూ పలు భాషల్లో నటించేసి భారతీయ సినీ నటిగా పేరు తెచ్చుకుంది. ఇంకా కథానాయకిగానే నటిస్తున్న ఈ మీల్కీబ్యూటీ అవకాశాలు తగ్గాయేమోగానీ, క్రేజ్‌ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అయితే కోలీవుడ్‌లో తమన్నా నటించిన చిత్రం తెరపైకి వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగులో ఇటీవల నటించిన నెక్టŠస్‌ ఏంటీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే ఆ విషయాన్ని ఈ అమ్మడు అంగీకరించడం లేదన్నది వేరే విషయం. నెక్ట్స్‌ఏంటీ చిత్రం చాలా మందికి నచ్చిందని, అందువల్ల అది సూపర్‌హిట్‌ చిత్రం అని నమ్మబలుకుతోంది. ఈ విషయాన్ని పక్కన పేడితే ఈ బ్యూటీ నటించిన తమిళ చిత్రం కన్నె కలైమానే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలంగా విడుదల కోసం ఎదురు చూస్తోంది.

ఆ చిత్ర విడుదల తేదీని నటి తమన్నా తాజాగా వెల్లడించింది. ఇటీవల చెన్నైలోని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తమన్నా మాట్లాడుతూ కన్నె కలైమానే అన్ని వర్గాల వారు చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని చెప్పింది. ఇందులో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని, చిత్రం ఫిబ్రవరి 1వ తేదీన విడుదల కానుందని తెలిపింది. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటావన్న ప్రశ్నకు మీ ఊరిలో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే చెప్పండి. పెళ్లి చేసుకుంటాను అని బదులిచ్చింది. ఇటీవల కన్నె కలైమానే చిత్ర ప్రచారం కోసం చెన్నైకి వచ్చిన తమన్నాను ఒక అభిమాని మీరంటే చాలా ఇష్టం మీమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నాను. అది సాధ్యం అవుతుందా? అని అడిగాడు. దీంతో పక్కనున్న నటుడు ఉదయనిధిస్టాలిన్‌ కలగచేసుకుని అస్సలు సాధ్యం కాదు. తమన్నాకు అమెరికాలో బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు తెలుసా? అని అన్నారు. దీంతో ఆయన చెప్పింది నిజమో, కాదో తెలియక అభిమానులు అయోమయానికి గురయ్యారు. అన్నట్టు ఈ భామ ప్రస్తుతం తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ, చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డిలో ముఖ్య భూమికను పోషిస్తోంది. అదే విధంగా హిందీలోనూ ఒక చిత్రం చేస్తోంది. ఇక తమిళంలో నటిస్తున్న దేవి–2 చిత్రం నిర్మాణంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement