
మన తారలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. అదేంటి? ప్రోగ్రెస్ కార్డ్ రావడానికి వాళ్లేమైనా బడికి వెళ్తున్నారా! అనుకోకండి. ప్రతి ఏడాది చివర్లో ఐ.యం.డి.బి (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) సంస్థ ఆన్‌లైన్‌లో సర్వే జరిపి, ఆ సంవత్సరంలో పాపులర్ అయిన అన్ని భాషల నటీనటుల లిస్ట్‌ను విడుదల చేస్తుంది. ఇదే ఆ ప్రోగ్రెస్ కార్డ్ అనట్టు. అలా ఈ సంవత్సరం కూడా సర్వే లిస్ట్‌ను విడుదల చేసింది ఐ.యం.డి.బి. దేశవ్యాప్తంగా కలñ క్షన్లతో మోత మోగించిన ‘బాహుబలి’ ఈ సర్వేలో కుడా సత్తా చాటింది. ఈ సంవత్సరం ఆ లిస్ట్‌లోకి మన బాహుబలి ‘ప్రభాస్’ చేరారు. ‘బాహుబలి’తో ఈ యంగ్ రెబల్ స్టార్ దేశవ్యాప్తంగా గుర్తింపుతో పాటు అభిమానులను కూడా పొందారనటంలో ఎటువంటి సందేహం లేదు.
బాలీవుడ్ ఖాన్స్‌తో పోటీగా నిలిచి, మన బాహుబలి 5వ స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో సౌత్ హీరోల్లో ప్రభాస్ ఒక్కరే ఉండటం గమనార్హం. అలాగే కథానాయికల్లో తమన్నా 4వ స్థానం, అనుష్క 8వ స్థానం దక్కించుకున్నారు. లిస్ట్ చూస్తుంటే ‘బాహుబలి’లో ఉన్న స్టార్స్‌కి ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఆల్రెడీ మనోళ్లకు పాపులార్టీ ఉంది. అయితే ఈ సిన్మా వరల్డ్ వైడ్‌గా మనోళ్లను పాపులర్ చేసింది. భళా బాహుబలి.