
మిల్కీ బ్యూటీ తమన్నాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మిల్కీ బ్యూటీ తమన్నాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. షూటింగ్ సెట్‌లో సరదాగా ఖాళీ సమయంలో తీసుకున్న ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ఈ వీడియోలో మూతికి మీసం పెట్టుకుని తమన్నా పాట పాడుతున్న వీడియో నెట్టింటా నవ్వులు పూయిస్తోంది. దీనికి ‘టాకింగ్ మాణిక్కం, వాకింగ్ మాణిక్కం, సింగింగ్ మాణిక్కం’ అంటూ సరదాగా షేర్ చేసింది ఆమె.
ఇది చూసిన ఆమె ఫాలోవర్స్, అభిమానులు తమన్నాకు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘వావ్ తమన్నా ఎంత ముద్దుగా ఉందో’, ‘మీసంతో అచ్చం మిక్కిమౌజ్‌లా ఉంది’, అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తమన్నా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’తో పాటు ‘సత్యదేవ్’,‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలతో బిజీగా ఉంది.
చదవండి:
తమన్నా ఇల్లు చూశారా..?, దాని కోసం ఎన్ని కోట్లు వెచ్చించిందో!
విషాదం: ‘వేదం’ నటుడు నాగయ్య మృతి