
రాధికా ఆప్టే, కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా... ఇలా కొంతమంది కథానాయికలు ‘కాస్టింగ్ కౌచ్’ గురించి బాహాటంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. సినిమా రంగంలో తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ పై బాలీవుడ్ బ్యూటీలందరూ నిర్మొహమాటంగా చెప్పి, చర్చకు తెర తీశారు. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? అనేది చాలామందికితెలియకపోవచ్చు. కథానాయికలకు చాన్స్ కావాలంటే కొంచెం పట్టూ విడుపుగా ఉండాలంటారు. ఈ వ్యవహారంపై ఇటీవల తమన్నా కూడా స్పందించారు.
కాస్టింగ్ కౌచ్ గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ – ‘‘చిత్రపరిశ్రమలో ఈ సమస్య ఉంది. అది కూడా వేరేవాళ్లు చెబితే తెలిసిందే. కానీ, నేనెప్పుడూ ఏ సమస్యా ఎదుర్కోలేదు. ఏదైనా మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన ‘శ్రీ’ నుంచి ఇప్పటివరకూ నాకెలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ లేవు. ఇక్కడే (దక్షిణాదిలో) కాదు... బాలీవుడ్ (హిందీ)లో కూడా నాకు ఇబ్బందులు ఎదురు కాలేదు’’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment