
అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నారు శంకర్. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తుండగా, ఆయనకు జోడీగా తమన్నా నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ప్రత్యేకంగా వేసిన కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో చిరంజీవి, కీర్తీ సురేష్‌లతో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటుండగా, ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. సత్యానంద్ కథా పర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి.
Comments
Please login to add a commentAdd a comment