సందీప్ కిషన్కు జోడిగా స్టార్ హీరోయిన్ | sandeep Kishan set to romance Tamanna | Sakshi
Sakshi News home page

సందీప్ కిషన్కు జోడిగా స్టార్ హీరోయిన్

Published Sat, May 27 2017 4:51 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

సందీప్ కిషన్కు జోడిగా స్టార్ హీరోయిన్ - Sakshi

సందీప్ కిషన్కు జోడిగా స్టార్ హీరోయిన్

బాహుబలి సినిమాతో నేషనల్ లెవల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న అందాల భామ తమన్నా. సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించినా.. వరుస అవకాశాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్న ఈ బ్యూటీ త్వరలో ఓ యంగ్ హీరోతో జత కట్టేందుకు అంగీకరించింది. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తొలిసారిగా తెలుగులో డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సందీప్ కిషన్ కు జోడిగా నటిస్తోంది తమన్నా.

బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ హీరో ఫనా, సైఫ్ అలీఖాన్ తో హమ్ తుమ్, తేరీ మేరి కహాని సినిమాలను రూపొందించిన కునాల్ కోహ్లి త్వరలో ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూర్తిగా లండన్ లో తెరకెక్కించనున్నారు. ముందుగా తమన్నా షూటింగ్ కు హాజరు కానుండగా సందీప్ కిషన్ జూన్ మొదటి వారంలో లండన్ వెళ్లనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement