వయసులో వెనక్కి వెళ్తున్నా | Actress Tamanna Interview about next enti | Sakshi
Sakshi News home page

వయసులో వెనక్కి వెళ్తున్నా

Published Mon, Dec 3 2018 4:19 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Actress Tamanna Interview about next enti - Sakshi

తమన్నా

‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలన్నింట్లో నా వయసు కంటే పెద్ద పాత్రలే చేశాను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలు చేసింది తక్కువ. ‘హ్యాపీడేస్,‘100% లవ్‌’ లో చేసినవి నా పాత్రకి దగ్గరగా ఉన్నాయి. మళ్లీ ‘నెక్ట్స్‌ ఏంటి?’ సినిమాలో అలాంటి పాత్రే చేశాను’’ అని తమన్నా అన్నారు. సందీప్‌ కిషన్, తమన్నా, నవదీప్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం‘నెక్ట్స్‌ ఏంటి?’. ఈ చిత్రంతో బాలీవుడ్‌ దర్శకుడు కునాల్‌ కోహ్లి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. రైనా జోషీ, అక్షయ్‌ పూరి నిర్మాతలు. ఈ చిత్రం ఈనెల 7న విడుదలవుతోంది.  ఈ సందర్భంగా తమన్నా చెప్పిన సంగతులు...  

► ‘నెక్ట్స్‌ ఏంటి?’ స్క్రిప్ట్‌ వినగానే ఎగై్జట్‌ అయ్యాను. గత రెండేళ్ల నుంచి తెలుగు సినిమాల్లో మార్చు వచ్చింది. కొత్త కథలు చేయడంలో, ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో మా ర్పు కనిపిస్తోంది. దానికి బాక్సాఫీస్‌ సక్సెసే సాక్ష్యం.
► ‘నెక్ట్స్‌ ఏంటి?’ కథ అంతా లండన్‌లో జరుగుతుంది. చాలా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా ముఖ్యంగా ట్యాగ్స్‌ గురించి మాట్లాడుతుంది. అమ్మాయి డీసెంట్‌గా డ్రెస్‌ చేసుకుంటే ఒక ట్యాగ్, ట్రెండీగా ఉంటే మరో ట్యాగ్‌ ఇస్తాం. ఈ ట్యాగ్‌లు ఎందుకివ్వాలి? అమ్మాయి చాలా చిన్న నుంచి పెద్ద నిర్ణయాల వరకూ అన్నీ తన సొంతంగానే తీసుకోవాలి. అదే మా సినిమాలో చూపిస్తున్నాం.
► సందీప్, నవదీప్‌ మంచి సహకారం అందించారు. నవదీప్‌ తన వయసు కంటే పెద్ద పాత్ర చేస్తున్నాడు. శరత్‌బాబుగారిది నా తండ్రి పాత్ర.
► ఈ సినిమా అమ్మాయి కోణంలో జరుగుతుంది.  అలా అని  ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమా అనే ట్యాగ్‌ వేయను.  
► ఈ కంటెంట్‌ చాలా బోల్డ్‌గా ఉంటుంది.  లవ్, సెక్స్‌ అన్నింటి గురించి ఓపెన్‌గానే మాట్లాడాం.  కునాల్‌కి తెలుగు సినిమా కొత్త కావచ్చు. కానీ, ఆయన కొత దర్శకుడిలాగానే ఫ్రెష్‌ కంటెంట్‌తో వస్తున్నారు.
► ఒక పని చేసేటప్పుడే అది పూర్తి కాకముందే నెక్ట్స్‌ ఏంటి? అంటుంటాం. ఉన్న మూమెంట్‌ని ఆస్వాదించం. ఆ ఉద్దేశంతోనే ఈ టైటిల్‌ ఫిక్స్‌ చేశాం. గుండె ను బరువు చేసే, ఏడిపించే పాత్రలు నాకు  నచ్చవు. నేను ఇండస్ట్రీకి వచ్చింది ప్రేక్షకులను  ఎంటర్‌టైన్‌ చేయడానికి, హ్యాపీగా ఉంచడానికి.
► ఈ ఏడాది ఎక్కువగా షూటింగ్స్‌తో గడిపాను. అందుకే తక్కువ రిలీజ్‌లు ఉన్నాయి. తమన్నా తక్కువ సినిమాలు చేస్తోంది అని రాస్తుంటారు.  వాళ్లు అలా రాసినప్పుడే నేను ఎక్కువ సినిమాలకు కమిట్‌ అయ్యుంటాను. మీరు అలానే రాయండి. నేను ఎక్కువ సినిమాలు చేస్తుంటాను (నవ్వుతూ).
► ప్రస్తుతం నేను నటిస్తున్న ‘ఎఫ్‌ 2’  పూర్తి కావచ్చింది. ‘సైరా’ లో నా పాత్ర షూటింగ్‌ ఇంకా ఉంది. ‘దటీజ్‌ మహాలక్ష్మి’ రిలీజ్‌కి రెడీగా ఉంది.
► టాప్‌ హీరోలతో పనిచేశా. యంగ్‌ హీరోలతోనూ చేస్తున్నాను. వయసు విషయంలో నాది రివర్స్‌ జరుగుతుంటుంది అనుకుంటున్నాను. ‘క్యూరియస్‌ కేస్‌ ఆఫ్‌ బెంజామిని’ అనే హాలీవుడ్‌ సినిమాలో హీరోలా. వయసు పెరిగేకొద్దీ చిన్నగా అయిపోతాను అనుకుంటాను(నవ్వుతూ).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement