మీనాక్షి అమ్మవారి సేవలో తమన్న | Heroine Tamannaah Visits Madurai Meenakshi Temple | Sakshi
Sakshi News home page

మీనాక్షి అమ్మవారి సేవలో తమన్న

Published Tue, Feb 6 2018 9:15 AM | Last Updated on Sun, Feb 11 2018 1:16 PM

Heroine Tamannaah Visits Madurai Meenakshi Temple - Sakshi

హీరోయిన్‌ తమన్న

చెన్నై : డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఉన్నా మనిషికి జీవితంలో ముఖ్యంగా కావలసింది ఒకటుంది. అదే మనశాంతి. అందుకు దైవానుగ్రహం ఉండాలి. వీలున్నప్పుడు  దైవ దర్శనం చేసుకుంటే భారం అంతా దిగిపోతుంది.  నటి నయనతార ఇటీవల అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించారు.  తాజాగా హీరోయిన్‌ తమన్న ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని అలౌకిక ఆనందాన్ని పొందా రు. దశాబ్దం దాటినా కథానాయకిగా తన స్థానా న్ని పదిలపరచుకుంటూ, తమిళం, తెలుగు, హింది భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది తమన్న. కోలీవుడ్‌లో ఇటీవల విక్రమ్‌తో జత కట్టిన తమన్నకు స్కెచ్‌ చిత్ర విజయం నూతనోత్సాహాన్నిచ్చిందనే చెప్పాలి.

ప్రస్తుతం తమిళంలో శీనూరామసామి దర్శకత్వంలో కన్నె కలైమానే చిత్రంలో నటిస్తున్నారు. ఆమె ఇంతకు ముందు ఈ దర్శకుడి  దర్శకత్వంలో నటించిన ధర్మదురై మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. తాజా చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌తో నటిస్తున్నారు. ఈ చిత్రం మధురై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న తమన్న సోమవారం ఉదయం మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఇతర భక్తులతో పాటు వరుసలో నిలబడి అమ్మవారి, సుందరేశ్వరుడు సన్నిధిని దర్శించుకున్నారు.  ఈ సంగతి స్థానికులకు తెలియడంతో తమన్నను చూసేందుకు ఆలయం ముందు గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త కలకలం చెలరేగింది. దైవ దర్శనం అనంతరం వెలపలికి వచ్చిన ఆమెను పోలీసుల భద్రత నడుమ సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement