‘‘ఓ భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. ఒరిజినల్‌ని మ్యాచ్ చేస్తే సరి΄ోదు.. దానికంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు బెటర్‌గా ఉండాలి.. అది పెద్ద సవాల్. అందుకే ‘భోళా శంకర్’ విజువల్స్ విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఒరిజినల్ ఫిల్మ్ ‘వేదాలం’ కంటే ‘భోళా శంకర్’ ఇంకా బాగుంటుంది’’ అని కెమెరామేన్ డడ్లీ(రాజేంద్ర) అన్నారు. చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర కెమెరామేన్ డడ్లీ మాట్లాడుతూ– ‘‘నా అసలు పేరు రాజేంద్ర. డడ్లీ నా ముద్దు పేరు. తమిళనాడులోని ఊటీ నా స్వస్థలం. తమిళనాడులో ఫిలిం టెక్నాలజీ చదువుకున్న తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాను. మెహర్ రమేష్, నేను పదేళ్లుగా స్నేహితులం. తనే ‘భోళా శంకర్’ అవకాశం ఇచ్చాడు. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఫుల్ ΄ప్యాకేజ్ ఆఫ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. చిరంజీవిగారు పెర్‌ఫెక్షనిస్ట్, చాలా పంక్చువల్. ఈ రెండు విషయాలు ఆయన్నుంచి నేర్చుకున్నాను. ‘భోళా శంకర్’లో ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే పెద్ద యాక్షన్ సీన్ తీయడం చాలా కష్టంగా అనిపించింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా అన్నీ సమకూర్చారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment