షూటింగ్స్ లేని ఈ లాక్‌డౌన్ వేళ తన మాతృభాష సింధీ నేర్చుకుంటున్నానని చెబుతున్నారు హీరోయిన్ తమన్నా. ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే– ‘‘ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నందువల్ల తెలుగు, తమిⶠభాషలను బాగానే మాట్లాడగలుగుతున్నాను. హిందీ కూడా వచ్చు. కొన్ని కారణాల వల్ల నా మాతృభాష సింధీపై ఇప్పటివరకు సరైన పట్టు సాధించలేకపోయాను. ఈ లాక్‌డౌన్ సమయంలో సింధీ భాషను నేర్చుకుంటున్నాను. మా అమ్మగారితో ప్రస్తుతం ఆ భాషలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. సాంప్రదాయ వంటకాలను నేర్చుకుంటున్నాను. అలాగే మా అమ్మగారి సాయంతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన పెంచుకుంటున్నాను. వృత్తిపరంగా బిజీగా ఉండటం వల్ల నేనెక్కువగా ఇంట్లో ఉండలేదు. ఇప్పుడు లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉండటం నాకు కాస్త కొత్తగా ఉంది. మా తమ్ముడు (ఆనంద్) న్యూయార్క్‌లో ఉండిపోయాడు. తను కూడా మాతో ఉండి ఉంటే మరింత బాగుండేదనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు తమన్నా.
Comments
Please login to add a commentAdd a comment