
నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా ప్రేమలో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడారు. ‘‘కో యాక్టర్‌తో కలిసి యాక్ట్ చేసినంత మాత్రాన అతనిపై ఆకర్షణ ఏర్పడుతుందంటే నేను నమ్మను. అలా అనుకుంటే నేను చాలామంది యాక్టర్స్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను.
ఏదైనా మనం వ్యక్తిగతంగా ఫీలవ్వాలి. మన మనసుకు అనిపించాలి. ఇక విజయ్ వర్మతో నా బాండింగ్ చాలా సహజంగా మొదలైంది. ఇలాంటి వ్యక్తి కోసమే నేను ఎదురు చూశాను. జీవితంలో చాలా సాధించిన నాలాంటి వారికి ప్రతిదానికీ చాలా కష్టపడాలనే ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి కోసం భారతీయ స్త్రీలు తమ జీవితం మొత్తం మార్చుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది.
జీవిత భాగస్వామిని పొందాలంటే అతను ఉన్న చోటుకి వెళ్లాలి.. లేదా అతన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా మసులుకోవాలి. కానీ నేను నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. నేనేం చేయకుండానే ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి (విజయ్ వర్మను ఉద్దేశించి).. చాలా కేర్ తీసుకునే వ్యక్తి. అతను ఉన్న చోటు నాకు ఆనందంగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. దీంతో విజయ్ వర్మతో ప్రేమను తమన్నా పరోక్షంగా కన్ఫార్మ్ చేశారని నెటిజన్లు అంటున్నారు.
ఇక తమన్నా నటించిన లేటెస్ట్ వెబ్ ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్ 2’లో విజయ్ వర్మ నటించారు. ఈ ఆంథాలజీ షూటింగ్ సమయంలోనే విజయ్, తమన్నా ప్రేమలో పడి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment