పవర్‌ఫుల్‌ మహాలక్ష్మీ | Tamanna Maha Lakshmi first look poster | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ మహాలక్ష్మీ

Published Sat, Oct 20 2018 1:06 AM | Last Updated on Sat, Oct 20 2018 1:06 AM

Tamanna Maha Lakshmi first look poster  - Sakshi

నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ చిత్రం ‘100% లవ్‌’ గుర్తుందా? ఆ సినిమాలో  తమన్నా పాత్ర పేరు ‘మహాలక్ష్మీ’ అని తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో తన గొప్పను తాను చెప్పుకునే ప్రతిసారీ ‘దటీజ్‌ మహాలక్ష్మీ’ అంటుంది తమన్నా. సరిగ్గా అదే టైటిల్‌తో హీరోయిన్‌ ఓరియంటెడ్‌  మూవీ చేశారు తమన్నా. హిందీ మూవీ ‘క్వీన్‌’కి ఇది రీమేక్‌. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. మను కుమరన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

సాధారణ అమ్మాయి తన జీవితంలో ఎదురైన సంఘటనలను ధైర్యంగా ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ఇందులో తమన్నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ చిత్రం టీజర్‌ను త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: తైజాన్‌ ఖొరాకువాలా, సంగీతం: అమిత్‌ త్రివేది, కెమెరా: మైకేల్‌ టబూరియస్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement