Maha lakshmi
-
ఉచిత బస్సు పథకంతో RTCకి నష్టమా, లాభమా?
-
ఇంకా కొన్ని పల్లెలకు చేరని ‘మహాలక్ష్మి’ భాగ్యం!
చిలుకూరు: రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల అమల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కానీ పలు గ్రామాల్లోని మహిళలకు ఈ పథకం అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో గ్రామీణ మహిళలు ఈ పథకానికి దూరమవుతున్నారు. తాము ఆటోలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నామని, పల్లెలకు బస్సులు నడిపించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో కోదాడ, సూర్యాపేట డిపోలు ఉన్నాయి. కోదాడ డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 40, ఎక్స్‌ప్రెస్‌లు 18 ఉన్నాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 62, ఎక్స్‌ప్రెస్‌లు 45 ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో మరో 25 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. కోదాడ డిపో పరిధిలోని చిలుకూరు మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం జాతీయ రహదారిపై ఉన్న చిలుకూరు మండల కేంద్రం, సీతారాంపురం గ్రామాలకు మాత్రమే ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. బేతవోలు, ఆచార్యులగూడెం, చెన్నారిగూడెం, నారాయణపురం తదితర ప్రధాన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. అదేవిధంగా మునగాల మండల పరిధిలోని 22 గ్రామాలకు నరసింహులగూడెం తప్ప ఏ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ప్రధానంగా నేలమర్రి, కలకోవ, జగన్నాథపురం తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. నడిగూడెం మండల పరిధిలో నడిగూడెంతో పాటు రామచంద్రాపురం, సిరిపురం, రత్నవరం తదితర ప్రధాన గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం లేదు. కోదాడ మండల పరిధిలో ఎర్రవరం గ్రామానికి వెళ్లే రహదారిలో తప్ప మిగిలిన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. హుజూర్నగర్ పరిధిలో సైతం జాతీయ రహదారుల వెంట ఉన్న గ్రామాలు, ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రాలకు వెళ్లే రహదారులకు తప్ప మిగిలిన గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం లేదు. ఇక.. సూర్యాపేట ఆర్టీసీ డిపో పరిధిలో కండగట్ల, యల్కారం, సోల్‌పేట, రామచంద్రాపురం, లోయపల్లి, కుంచమర్తి, మాచిడిరెడ్డి పల్లి, మామిడిపల్లి తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం కల్పించాలి మా గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావడం లేదు. దీంతో మేము ఉచిత బస్సు ప్రయాణం పథకానికి దూరమవుతున్నాం. గతంలో మా గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. కేవలం ఆటోలే దిక్కు. పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలి. – కల్పన, జెర్రిపోతులగూడెం, చిలుకూరు మండలం కేవలం ప్రధాన రహదారులకే.. కరోనా అనంతరం ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆదాయం రావడం లేదని, పల్లెలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది. దీనికి తోడు కాలం చెల్లిన వాటి స్థానంలో నూతన బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో కేవలం ఆదాయం వచ్చే ప్రధాన రహదారుల్లోనే బస్సులు నడపిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో తమ గ్రామాలకు బస్సులను నడపాలని గ్రామీణ ప్రాంత మహిళలు వేడుకుంటున్నారు. -
TSRTC: ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోందన్నారు. అయితే, హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య స్కీమ్ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం’ అని తెలిపారు. ఈ కొత్త బస్సుల్లో బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సుల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్) ఉందని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను #TSRTC అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు… pic.twitter.com/fjALCZS9Pm — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 22, 2023 ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
పవర్ఫుల్ మహాలక్ష్మీ
నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రం ‘100% లవ్’ గుర్తుందా? ఆ సినిమాలో తమన్నా పాత్ర పేరు ‘మహాలక్ష్మీ’ అని తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో తన గొప్పను తాను చెప్పుకునే ప్రతిసారీ ‘దటీజ్ మహాలక్ష్మీ’ అంటుంది తమన్నా. సరిగ్గా అదే టైటిల్‌తో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేశారు తమన్నా. హిందీ మూవీ ‘క్వీన్’కి ఇది రీమేక్. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మను కుమరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాధారణ అమ్మాయి తన జీవితంలో ఎదురైన సంఘటనలను ధైర్యంగా ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ఇందులో తమన్నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ చిత్రం టీజర్‌ను త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: తైజాన్ ఖొరాకువాలా, సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: మైకేల్ టబూరియస్. -
దటీజ్ మహాలక్ష్మీ..
మహిళలను వివిధ విపత్కర పరిస్థితులనుంచి కాపాడేందుకు పోలీసు విభాగంలో తొలిసారిగా మహిళా బ్లూకోల్ట్స్‌ను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ఏర్పాటు చేశారు. అలా మహిళా బ్లూకోల్ట్స్‌గా నియమితులైన కట్టా మహాలక్ష్మి విధినిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తూ పలువురి ప్రశంసలందుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పలువురు మహిళలను ఆమె కాపాడారు. ఈవ్ టీజింగ్ తదితర సమస్యల నుంచి మహిళలను కాపాడుతూదటీజ్ మహాలక్ష్మి అనినిరూపించుకుంటున్నారు. రాజమహేంద్రవరం క్రైం : రాష్ట్రంలోనే తొలి మహిళా బ్లూకోల్ట్స్‌గా నియమితులైన కట్టా మహా లక్ష్మి తన సేవలతో అందరి ప్రశంసలందుకుంటున్నారు. కాకినాడకు చెందిన మహాలక్ష్మి బీఏ బీఈడీ చేశారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మహాలక్ష్మి తల్లి ఆశయాల మేరకు పోలీసుశాఖలో ప్రవేశించారు. 2014 బ్యాచ్‌కు చెందిన మహాలక్ష్మి ఒంగోలులో శిక్షణ పొందారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో మహిళా పోలీసుగా నియమితులయ్యారు. రాజమహేంద్రవరం త్రీటౌన్‌లో విధులు నిర్వహిస్తున్న మహాలక్ష్మిని అర్బన్ ఎస్పీ రాజకుమారి రాష్ట్రంలోనే మొట్ట మొదటి మహిళా బ్లూ కోల్ట్స్గా నియమించారు. ఆమె అంకితభావంతో విధులను నిర్వహిస్తూ పలువురి ప్రశంసలందుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న పలువురు మహిళలను కాపాడారు. కోరుకొండ మండలం, కణుపురు గ్రామానికి చెందిన శానాపతి వెంకట లక్ష్మి భర్త వేధింపులు తాళలేక ఈ ఏడాది జనవరి 1న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ఆత్మహత్యా యత్నం చేసుకుంటుండగా పసిగట్టిన మహిళా బ్లూకోల్ట్స్ మహాలక్ష్మి ఆమెను రక్షించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించి ఆమెను బంధువులకు అప్పగించారు. అలాగే యానాంకు చెందిన నల్లా దుర్గా దేవిని కూడా కాపాడారు. ఆమె భర్త వికలాంగుడు. ఆమెను ఇరుగుపొరుగు వారు సూటిపోటి మాటలతో వేధించేవారు. దాంతో మనస్తాపానికి గురైన దుర్గాదేవి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ వద్దకు వచ్చి జనవరి నెలలో ఆత్మహత్యా యత్నం చేసుకోబోయింది. ఆమెను కూడా మహిళా బ్లూకోల్ట్స్ రక్షించి పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆమెను సోదరుడికి అప్పగించారు. ఈవ్‌టీజింగ్ తదితరాల బారిన పడకుండా బాధితుల వద్దకు వెళ్లి వివరాలను సేకరించి మహిళలను ఆదుకోవడంలో ముందుంటూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు మహాలక్ష్మి. -
స్టార్టప్‌లకు రూ.100 కోట్ల ఫండ్
ముందుకొచ్చిన వేల్‌టెక్ యూనివర్సిటీ ► 1.2 లక్షల చదరపు అడుగుల్లో ఇంక్యుబేటర్ ► ఔత్సాహికులకు ఉచితంగా వినియోగించుకునే వీలు ► 'సాక్షి’తో యూనివర్సిటీ చైర్పర్సన్ మహాలక్ష్మి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఆవిష్కరణలను పోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నిధి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్టులో దేశ వ్యాప్తంగా ఆరు విద్యాసంస్థలు పాలుపంచుకుంటున్నాయి. ఈ ఆరింటిలో మూడు ఐఐటీలు కాగా, ఒక ఐఐఎం, రెండు ప్రైవేటు యూనివర్సిటీలున్నాయి. ఆ రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లో చెన్నెలోని వేల్‌టెక్ డాక్టర్ ఆర్ఆర్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఒకటి. కేంద్రం ఈ వర్సిటీకి తన వంతుగా రూ.23 కోట్ల నిధులు సమకూర్చగా... వర్సిటీ కూడా మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ.29 కోట్లు ఖర్చుచేస్తోంది. ‘‘ఒకో విద్యార్థి కనీసం నలుగురికైనా ఉపాధి కల్పించేలా ఎదగాలన్నదే మా ధ్యేయం. ఇదే లక్ష్యంతో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి కావలసిన వాతావరణం కల్పిస్తున్నాం’’ అని వర్సిటీ చైర్పర్సన్ ఆర్.మహాలక్ష్మి కిశోర్ చెప్పారు. ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ... దీనికోసం వేల్‌టెక్ రీసెర్చ్ పార్క్ పేరిట వర్సిటీలో ఇంక్యుబేటర్‌ను 1.2 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఇంక్యుబేటర్‌ను ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే 42 స్టార్టప్‌లు వచ్చాయి. డేటా అనలిటిక్స్, తయారీ, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, యూఏవీ విభాగాల్లో ఫోకస్ చేస్తున్నాం’’ అన్నారామె. స్టార్టప్‌లకు రూ.50 లక్షల చొప్పున సాయం మంచి వ్యాపార ఆలోచనకు అంకురార్పణ, దానికి రూపం ఇవ్వడం, అమలు చేయడం, నిర్వహణలోకి తేవడం.. ఇదే తమ లక్ష్యమని మహాలక్ష్మి చెప్పారు. ‘ప్రోటోటైప్ రూపొందించాక ఎంపికైన స్టార్టప్‌లకు ఒక్కోదానికి రూ.50 లక్షల దాకా ఆర్థిక సాయం అందజేస్తాం. ఇది రుణం లేదా వాటా రూపంలో ఉంటుంది. స్టార్టప్‌ల కోసం వచ్చే ఏడేళ్లలో రూ.100 కోట్లు ఖర్చు చేస్తాం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్‌న్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2017 టాప్–100 యంగ్ విభాగంలో 74వ స్థానం, భారత్‌లో తొలి స్థానాన్ని వేల్‌టెక్ దక్కించుకుకుంది. భారత్‌లో విద్యాసంస్థల పరంగా పేటెంట్లు దరఖాస్తు చేయడంలో టాప్–7లో నిలిచామని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కె.వి.డి.కిశోర్ కుమార్ తెలిపారు. టాప్ ప్రాజెక్టులివే.. తమ రీసెర్చ్ పార్క్‌లోని టాప్ ప్రాజెక్టుల్ని వర్సిటీ ఈ సందర్భంగా ప్రదర్శించింది. వీటిలో రూ.12 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఆంఫిబియస్ వెహికిల్ ఉంది. నీటిపై తేలుతూ నీటిని సేకరించి మూడు నిముషాల్లో నాణ్యత నివేదికను ఇవ్వడం దీని ప్రత్యేకత. మనుషులు పోలేని చోటకు కూడా ఇది వెళ్లగలదు. వంతెనలు, భారీ భవనాల నాణ్యతను తెలుసుకునే డ్రోన్‌తో పాటు ఓ బృందం శాటిలైట్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ–సైకిళ్ల కోసం మాగ్నెట్ రహిత మోటార్‌ను తయారు చేస్తున్నారు. తక్కువ బరువుతో ఎక్కువ దూరం ప్రయాణించడం ఈ మోటార్ల ప్రత్యేకత. -
కూతురు మృతిపై తల్లి ఫిర్యాదు
► 44 రోజుల తరువాత మృతదేహం వెలికితీత తిరువళ్లూరు: కూతురు మృతిలో మిస్టరీ ఉందని ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు తల్లి చేసిన ఫిర్యాదు మేరకు దాదాపు 44 రోజుల తరువాత మృతదేహాన్ని వెలికితీసి శవరీక్ష నిర్వహించిన సంఘటన తిరువళ్లూరు జిల్లా వేపంబట్టులో సోమవారం సాయంత్రం కలకలం సృస్టించింది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానికి చెందిన యాయుద్దీన్ కుమారుడు కార్తికేయన్(35) ఆరోగ్యశాఖలో పని చేస్తున్నాడు. ఇతనికి పళ్లికారనై ప్రాంతానికి చెందిన మహాలక్ష్మీ(32)కి 2014 మేలో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో గత జనవరి 21న మహాలక్ష్మీ మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులకు కార్తికేయన్ సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే తన కుమార్తె మృతిలో మిస్టరీ ఉన్నట్టు ఆమె తల్లి అంజలదేవి ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు ఫిబ్రవరి20న పిర్యాదు చేసింది. తన కుమార్తె మృతిలో ఉన్న మిస్టరీ కోసం పోస్టుమార్టం నిర్వహించాలని కోరగా, సంబంధిత ఫిర్యాదును సెవ్వాపేట పోలీసులకు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందుకున్న సమాచారంతో మహాలక్ష్మి మృతిని అనుమానంగా భావించి కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే సోమవారం ఆర్డీవో దివ్యశ్రీ,, డీఎస్పీ ఈశ్వరన్ నేతృత్వంలో శవాన్ని వెలికి తీశారు. అనంతరం డాక్టర్ శోభన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ మృతదేహాన్ని దాదాపు 44 రోజుల తరువాత వెలికి తీయడంతో పాటు పోస్టుమార్టం నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శవపరీక్ష వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడంతో పాటు తప్పు జరిగినట్టు నిర్ధారణ జరిగితే సంబంధం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో దివ్యశ్రీ, డీఎస్పీ ఈశ్వరన్ స్పష్టం చేశారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
ముమ్మిడివరం: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్ పై వెళుతున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఈ ఘటన జరిగింది. ఐ.పోలవరం మండలం ఎదుర్లంకకు చెందిన దంపతులు సోమవారం బైక్‌పై కాట్రేనికోన వెళుతున్నారు. ముమ్మిడివరంలో వీరి బైక్‌ను అమలాపురం డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొంది. బైక్‌పై వెనుక కూర్చున్న బీవీ మహాలక్ష్మి తీవ్ర గాయాలతో మృతి చెందింది. -
ఆవిరైన ఆనందం
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఏడు రోజుల పసికందు, బాలింత,మరో ఇద్దరు దుర్మరణం అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కోజన్‌కొత్తూర్‌లో విషాదం పాప పుట్టిందన్న ఆనందం వారం రోజులకే ఆవిరైంది. నిజామాబాద్ జిల్లాలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పసికందు, పచ్చిబాలింతరాలైన తల్లితోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను బలిగొంది. మహాలక్ష్మిని ఇంటికి తీసుకువస్తున్న సమయంలో మృత్యుదేవత కబళించడంతో మృతుల స్వగ్రామం కోజన్‌కొత్తూర్‌లో విషాదం అలుముకుంది. ఇబ్రహీంపట్నం :నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్‌కొత్తూర్ గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. కోజన్‌కొత్తూర్‌కు చెందిన సుంకరి నర్సయ్య, రాంబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమార్తెలిద్దరికీ వివాహమైంది. నర్సయ్య, చిన్న కుమారుడు వినోద్ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లివస్తున్నారు. రెండు నెలల క్రితం పెద్ద కుమారుడు గంగనర్సయ్య వివాహానికి హాజరైన వారిద్దరు వారం క్రితమే దుబాయి తిరిగెళ్లారు. పెద్ద కూతురు సుజాత(27) వివాహం నిజామాబాద్ జిల్లా గుత్పకు చెందిన పిట్ల ప్రవీణ్‌తో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉండగా, సుజాత వారం క్రితం ఆర్మూర్ ఆస్పత్రిలో కూతురికి జన్మనిచ్చింది. వీరిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు రాంబాయి(45) కొడుకు గంగ నర్సయ్య, చిన్న కూతురు సుమలత(25)తో కలిసి అద్దెకారులో ఆర్మూర్ వెళ్లింది. సుజాతను, వారం రోజు ల పసికందును తీసుకుని అదేకారులో తిరుగుపయన మయ్యారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారులో 63వ నంబర్ జాతీయ రహదారిపై వీరి కారు ఓవర్టేక్ చేయబోయి మరో కారు, డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంబాయి అక్కడికక్కడే మృతి చెందింది. సుజాతను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా, సుమలత, సుజాత కూతురు(ఏడు రోజుల పసికందు)ను మెట్పల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. రాంబాయి పెద్ద కుమారుడు గంగనర్సయ్య, కారు డ్రైవర్ బోదాసు రాజేందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసి దుబాయిలో ఉన్న నర్సయ్య, వినోద్ స్వదేశానికి బయల్దేరారు. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.