స్టార్టప్‌లకు రూ.100 కోట్ల ఫండ్‌ | Rs 100 crore fund for startups | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లకు రూ.100 కోట్ల ఫండ్‌

Published Mon, May 1 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

స్టార్టప్‌లకు రూ.100 కోట్ల ఫండ్‌

స్టార్టప్‌లకు రూ.100 కోట్ల ఫండ్‌

ముందుకొచ్చిన వేల్‌టెక్‌ యూనివర్సిటీ
►  1.2 లక్షల చదరపు అడుగుల్లో ఇంక్యుబేటర్‌
► ఔత్సాహికులకు ఉచితంగా వినియోగించుకునే వీలు
► 'సాక్షి’తో యూనివర్సిటీ చైర్‌పర్సన్‌ మహాలక్ష్మి


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొత్త ఆవిష్కరణలను పోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నిధి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రాజెక్టులో దేశ వ్యాప్తంగా ఆరు విద్యాసంస్థలు పాలుపంచుకుంటున్నాయి. ఈ ఆరింటిలో మూడు ఐఐటీలు కాగా, ఒక ఐఐఎం, రెండు ప్రైవేటు యూనివర్సిటీలున్నాయి. ఆ రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లో చెన్నెలోని  వేల్‌టెక్‌ డాక్టర్‌ ఆర్‌ఆర్‌ ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఒకటి. కేంద్రం ఈ వర్సిటీకి తన వంతుగా రూ.23 కోట్ల నిధులు సమకూర్చగా... వర్సిటీ కూడా మ్యాచింగ్‌ గ్రాంట్‌గా రూ.29 కోట్లు ఖర్చుచేస్తోంది. ‘‘ఒకో విద్యార్థి కనీసం నలుగురికైనా ఉపాధి కల్పించేలా ఎదగాలన్నదే మా ధ్యేయం. ఇదే లక్ష్యంతో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం.

విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి కావలసిన వాతావరణం కల్పిస్తున్నాం’’ అని వర్సిటీ చైర్‌పర్సన్‌ ఆర్‌.మహాలక్ష్మి కిశోర్‌ చెప్పారు. ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ... దీనికోసం వేల్‌టెక్‌ రీసెర్చ్‌ పార్క్‌ పేరిట వర్సిటీలో ఇంక్యుబేటర్‌ను 1.2 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఇంక్యుబేటర్‌ను ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే 42 స్టార్టప్‌లు వచ్చాయి. డేటా అనలిటిక్స్, తయారీ, ఐవోటీ, సైబర్‌ సెక్యూరిటీ, రోబోటిక్స్, యూఏవీ విభాగాల్లో ఫోకస్‌ చేస్తున్నాం’’ అన్నారామె.

స్టార్టప్‌లకు రూ.50 లక్షల చొప్పున సాయం
మంచి వ్యాపార ఆలోచనకు అంకురార్పణ, దానికి రూపం ఇవ్వడం, అమలు చేయడం, నిర్వహణలోకి తేవడం.. ఇదే తమ లక్ష్యమని మహాలక్ష్మి చెప్పారు. ‘ప్రోటోటైప్‌ రూపొందించాక ఎంపికైన స్టార్టప్‌లకు ఒక్కోదానికి రూ.50 లక్షల దాకా ఆర్థిక సాయం అందజేస్తాం. ఇది రుణం లేదా వాటా రూపంలో ఉంటుంది. స్టార్టప్‌ల కోసం వచ్చే ఏడేళ్లలో రూ.100 కోట్లు ఖర్చు చేస్తాం. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌న్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ 2017 టాప్‌–100 యంగ్‌ విభాగంలో 74వ స్థానం, భారత్‌లో తొలి స్థానాన్ని వేల్‌టెక్‌ దక్కించుకుకుంది. భారత్‌లో విద్యాసంస్థల పరంగా పేటెంట్లు దరఖాస్తు చేయడంలో టాప్‌–7లో నిలిచామని వర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.వి.డి.కిశోర్‌ కుమార్‌ తెలిపారు.

టాప్‌ ప్రాజెక్టులివే..
తమ రీసెర్చ్‌ పార్క్‌లోని టాప్‌ ప్రాజెక్టుల్ని వర్సిటీ ఈ సందర్భంగా ప్రదర్శించింది. వీటిలో రూ.12 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఆంఫిబియస్‌ వెహికిల్‌ ఉంది. నీటిపై తేలుతూ నీటిని సేకరించి మూడు నిముషాల్లో నాణ్యత నివేదికను ఇవ్వడం దీని ప్రత్యేకత. మనుషులు పోలేని చోటకు కూడా ఇది వెళ్లగలదు. వంతెనలు, భారీ భవనాల నాణ్యతను తెలుసుకునే డ్రోన్‌తో పాటు ఓ బృందం శాటిలైట్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ–సైకిళ్ల కోసం మాగ్నెట్‌ రహిత మోటార్‌ను తయారు చేస్తున్నారు. తక్కువ బరువుతో ఎక్కువ దూరం ప్రయాణించడం ఈ మోటార్ల ప్రత్యేకత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement