శానాపతి వెంకటలక్ష్మిని కాపాడుతూ.. నల్లా దుర్గాదేవితో మహాలక్ష్మి
మహిళలను వివిధ విపత్కర పరిస్థితులనుంచి కాపాడేందుకు పోలీసు విభాగంలో తొలిసారిగా మహిళా బ్లూకోల్ట్స్‌ను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ఏర్పాటు చేశారు. అలా మహిళా బ్లూకోల్ట్స్‌గా నియమితులైన కట్టా మహాలక్ష్మి విధినిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తూ పలువురి ప్రశంసలందుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పలువురు మహిళలను ఆమె కాపాడారు. ఈవ్ టీజింగ్ తదితర సమస్యల నుంచి మహిళలను కాపాడుతూదటీజ్ మహాలక్ష్మి అనినిరూపించుకుంటున్నారు.
రాజమహేంద్రవరం క్రైం : రాష్ట్రంలోనే తొలి మహిళా బ్లూకోల్ట్స్‌గా నియమితులైన కట్టా మహా లక్ష్మి తన సేవలతో అందరి ప్రశంసలందుకుంటున్నారు. కాకినాడకు చెందిన మహాలక్ష్మి బీఏ బీఈడీ చేశారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మహాలక్ష్మి తల్లి ఆశయాల మేరకు పోలీసుశాఖలో ప్రవేశించారు. 2014 బ్యాచ్‌కు చెందిన మహాలక్ష్మి ఒంగోలులో శిక్షణ పొందారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో మహిళా పోలీసుగా నియమితులయ్యారు. రాజమహేంద్రవరం త్రీటౌన్‌లో విధులు నిర్వహిస్తున్న మహాలక్ష్మిని అర్బన్ ఎస్పీ రాజకుమారి రాష్ట్రంలోనే మొట్ట మొదటి మహిళా బ్లూ కోల్ట్స్‌గా నియమించారు. ఆమె అంకితభావంతో విధులను నిర్వహిస్తూ పలువురి ప్రశంసలందుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న పలువురు మహిళలను కాపాడారు.
కోరుకొండ మండలం, కణుపురు గ్రామానికి చెందిన శానాపతి వెంకట లక్ష్మి భర్త వేధింపులు తాళలేక ఈ ఏడాది జనవరి 1న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ఆత్మహత్యా యత్నం చేసుకుంటుండగా పసిగట్టిన మహిళా బ్లూకోల్ట్స్ మహాలక్ష్మి ఆమెను రక్షించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించి ఆమెను బంధువులకు అప్పగించారు. అలాగే యానాంకు చెందిన నల్లా దుర్గా దేవిని కూడా కాపాడారు. ఆమె భర్త వికలాంగుడు. ఆమెను ఇరుగుపొరుగు వారు సూటిపోటి మాటలతో వేధించేవారు. దాంతో మనస్తాపానికి గురైన దుర్గాదేవి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ వద్దకు వచ్చి జనవరి నెలలో ఆత్మహత్యా యత్నం చేసుకోబోయింది. ఆమెను కూడా మహిళా బ్లూకోల్ట్స్ రక్షించి పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆమెను సోదరుడికి అప్పగించారు. ఈవ్‌టీజింగ్ తదితరాల బారిన పడకుండా బాధితుల వద్దకు వెళ్లి వివరాలను సేకరించి మహిళలను ఆదుకోవడంలో ముందుంటూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు మహాలక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment