
సాక్షి, హైదరాబాద్: మిల్కీబ్యూటీ తమన్నా తళుక్కుమంది. శుక్రవారం మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. తెలుగు వంటకాలంటే తనకెంతో ఇష్టమంది. ప్రత్యేకంగా చేసే రసం, చేపల పులుసును మస్తు లాగిస్తానంది. వంటకాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని చెప్పింది.
‘మాస్టర్ చెఫ్’ కార్యక్రమంతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. కార్యక్రమంలో నటుడు అల్లు శిరీష్, ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీ ఫౌండర్ శ్రావణ ప్రసాద్, ప్రముఖ చెఫ్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.