మళ్లీ మళ్లీ భయపెడతా | Tamanna who has focused more on horror films | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ భయపెడతా

Jun 10 2019 5:52 AM | Updated on Jun 10 2019 5:52 AM

Tamanna  who has focused more on horror films - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా హారర్‌ సినిమాల మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు, ఇటీవల రిలీజ్‌ అయిన సినిమాలను గమనిస్తే ప్రేక్షకులను భయపెట్టే హారర్‌ మూడ్‌లోనే తమన్నా ఉన్నట్టు అనిపిస్తోంది. గత వారంలో ‘దేవి 2’ చిత్రంతో తమిళ్, తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన ఆమె వచ్చే వారం ‘కామోషి’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులనూ భయపెట్టనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న మరో తమిళ సినిమా కూడా హారర్‌ చిత్రమే. విశేషమేటంటే ఆ సినిమా తాప్సీ నటించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రానికి రీమేక్‌ అని తెలిసింది. రోహన్‌ వెంకటేశన్‌ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేయనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement