హీరోని ఆకట్టుకోడానికి ‘జీరో’ అక్కర్లేదు!
గ్లామర్ పాయింట్
హీరోయిన్ ఎలా ఉండాలి?
ఈ ప్రశ్నకు మొదటగా వచ్చే సమాధానం స్లిమ్‌గా, నాజూగ్గా ఉండాలి అని.
స్లిమ్‌నెస్ అన్నదే హీరోయిన్‌కి కొలమానమా? కానే కాదు అని ఎప్పుడో నిరూపణ అయ్యింది. ఒకనాడు సావిత్రి, మీనాకుమారి వంటి నటీమణులు ప్రతిభ ముందు పర్సనాలిటీ పని చేయదని ప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఖుష్బూ, సౌందర్య లాంటి తారామణులు ఫిగరుతో సంబంధం లేకుండా తమ నటనతో మెస్మరైజ్ చేశారు.
ఇప్పుడు ఈ యంగ్ యాక్ట్రెస్‌లు కూడా అదే మార్గంలో పయనిస్తున్నారు. సినిమాలో హీరోని ఆకట్టుకోడానికి జీరో సైజు అవసరం లేదు, ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించడానికి స్లిమ్‌గానే ఉండక్కర్లేదు అని బాక్సాఫీసులు బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. వాళ్లకున్న క్రేజ్ మనకు తెలుసు కాబట్టి ఒప్పుకోక తప్పుతుందా!