Glamour point
-
హృదయ రాణులు
గ్లామర్ పాయింట్ సినిమా అంటేనే కల్పన అంటారు. కానీ కల్పిత కథలకే కాదు, యదార్థ గాథలకూ అక్కడ చోటుంది. అందుకే చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోయిన కొన్ని సంఘటనలను, కొందరు మహామహుల జీవితాలను తెరకెక్కించే ప్రయత్నం అడపా దడపా చేస్తుంటారు దర్శకులు. అలాంటి చారిత్రాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మలు వీరు... ఐశ్వర్యారాయ్ అందానికే అందం ఐశ్వర్యారాయ్. ఆమె అందం మరింత ఇనుమడించింది ‘జోథా’ పాత్రలో. అక్బర్ హృదయరాణిగా ‘జోథాఅక్బర్’లో రాజసాన్ని ఒలికించిందామె. సాహిత్యం ఆధారంగా తెరకెక్కిన ఉమ్రావ్‌జాన్, దేవదాస్ వంటి చిత్రాల్లో తన నటనతో మెస్మరైజ్ చేసిన ఐష్.... ఈ హిస్టారికల్ ఫిల్మ్‌తో నటిగా మరో మెట్టు ఎదిగిందని చెప్పాలి. కరీనా కపూర్ గ్లామరస్ హీరోయిన్గా బాలీవుడ్లో కరీనా స్థానం ప్రత్యేకమైనది. ‘అశోకా’ చిత్రంలో అయితే ఓ గ్లామరస్ క్వీన్‌గా చేసింది. సామ్రాట్ అశోకగా షారుఖ్ ఖాన్ నటించిన ఆ చిత్రంలో కళింగ సామ్రాజ్యపు యువరాణి కరువాకిగా వైవిధ్య భరిత పాత్ర చేసింది కరీనా. ‘రాత్ కా నషా’ అని పాడుతూ సామ్రాట్ అశోక మనసుతో పాటు తన అభిమానుల హృదయాలనూ దోచేసింది. అనుష్క అనుష్క రూటే సెపరేటు. గ్లామర్ పాత్రలతో మొదలెట్టి, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల నాయికగా మారిపోయింది. ‘అరుంధతి’ చూశాక... తనలో ఇంత ప్రతిభ ఉందా అంటూ ఆశ్చర్యపోయా రంతా. ఆమె అద్భుత నటనకు, చూపు తిప్పుకోనివ్వని హావభావాలకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఇప్పుడు అంతకంటే పవర్‌ఫుల్‌గా కనిపించింది ‘రుద్రమదేవి’లో. కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి గురించి పాఠాల్లో చదువుకున్నా... వెండితెరపై ఆమెను ఒక పాత్రగా చూడటం, అందులోనూ ఆ పాత్రలో అనుష్క కనిపించడం అన్నది ఓ గొప్ప అనుభూతి అంటున్నారు ఆమె ఫ్యాన్స్. దీపికా పదుకొనె ఫీల్డ్‌లో అడగుపెట్టిన కొత్తలో దీపికను చూసి... ఓ గ్లామర్ డాల్‌గా మిగిలిపోతుందేమో అనుకున్నా రంతా. ‘ఓం శాంతి ఓం’ లాంటి సినిమా ద్వారా ఓ బరువైన పాత్రతో పరిచయమైనా... ఆ తర్వాత మామూలు ప్రేమకథా చిత్రాలు చేసుకుంటూ పోవడమే దానికి కారణం. కానీ ఉండేకొద్దీ తన స్టయిల్‌ను మార్చింది దీపిక. డిఫరెంట్‌గా ఉండే పాత్రలే ఎంచుకోవడం మొదలెట్టింది. ఆ క్రమంలోనే ఇప్పుడు మరాఠా రాజుల కాలం నాటి కథతో వస్తోన్న ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలో ‘మస్తానీ’గా మెరవబోతోంది. -
కిల్లర్ క్వీన్స్
గ్లామర్ పాయింట్ ఏ సినిమాలో అయినా హీరోయిన్ ఎలా ఉంటుంది? సున్నితంగా, సుకుమారంగా ఉంటుంది. మిగతా పాత్రలన్నింటినీ తన మంచితనంతో, ప్రేమాభిమానాలతో ఆకట్టుకుంటుంది. కానీ ఈ హీరోయిన్లు మాత్రం కొన్ని సినిమాల్లో అలా చేయలేదు. భయపెట్టారు. కత్తి పట్టి హడలెత్తించారు. సీరియల్ కిల్లర్సగా కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టారు. వెరైటీ పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది ప్రియాంక. ‘సాత్ ఖూన్ మాఫ్’ చిత్రంలో కూడా ఓ వైవిధ్యభరితమైన పాత్ర చేసిందామె. వరుసగా ఏడుగురు పురుషులను పెళ్లాడుతుంది. వారిలో ఆరుగురిని చంపేస్తుంది. ఒక రకమైన మానసిక రుగ్మతతో హత్యలకు పాల్పడే ఆ పాత్రలో ఆమె నటన అమోఘం. ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో ప్రేమకు ప్రతిరూపంలా కనిపించే ప్రియురాలిగా నటించింది కాజోల్. కానీ ‘గుప్త్’ సినిమాలో మాత్రం ఇలాంటి ప్రేయసి ఉండకూడదురా బాబూ అనిపించే పాత్ర చేసింది. అందులో ఆమె హీరోని ప్రేమిస్తుంది. వాళ్ల పెళ్లికి ఒప్పు కోలేదని హీరో తండ్రిని చంపే స్తుంది. అక్కడ్నుంచి తనకు అడ్డొచ్చిన వాళ్లందరినీ మట్టు బెడుతూ పోతుంది. చివరికి పోలీసుల చేతిలో చనిపోతుంది. ఎప్పుడూ సెంటిమెంటుని పండించే ఆమెని సీరియల్ కిల్లర్‌గా చూసి బాగా ఎంజాయ్ చేశారు కాజోల్ ఫ్యాన్స్. తన అందంతో బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఊర్మిళ... ‘కౌన్’ సినిమాలో కిల్లర్‌గా నటించి భయపెట్టింది. మొదట బాధితురాలిలా అనిపించినా, చివరికి హంతకి రూపంలో కనిపించి ఖంగు తినిపిస్తుంది. రామ్‌గోపాల్‌వర్మ తీసిన ఆ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఊర్మిళ పెర్ఫార్మెన్స్ సూపర్బ్‌గా ఉంటుంది. అందంతోనే కాదు, అభినయంతోనూ ఆకట్టుకోగలదని నిరూపించింది. ‘అతనొక్కడే’ సినిమాలో మొదట అమాయకంగా కనిపిస్తుంది సింధు తులానీ. కానీ హఠాత్తుగా ఆమెలోని మరో మనిషి బయటికొస్తుంది. తన కుటుంబాన్ని తనకు దూరం చేసినవాళ్ల మీద పగబట్టి, ప్లాన్ చేసి వాళ్లను చంపేస్తూ ఉంటుంది. కూల్‌గా కనిపిస్తూనే అప్పుడప్పుడూ క్రూరంగా మారే పాత్రలో ఆమె చక్కగా నటించింది. -
డబుల్ గ్లామర్
గ్లామర్ పాయింట్ చాలా యేళ్ల క్రితం ‘గంగ-మంగ’ అనే సినిమా విడుదలయ్యింది. అందులో ఇద్దరు వాణిశ్రీలు ఉంటారు. ఒకరు సాఫ్ట్. మరొకరు ఫాస్ట్. ఒక వాణిశ్రీ అమాయకత్వంతో గుండెలు పిండేస్తే, మరో వాణిశ్రీ హీరోలను మించి ఫైట్లు చేసి అదరగొట్టేసింది. వాణిశ్రీ ఫ్యాన్స అందరూ రెండు విభిన్నమైన పాత్రల్లో ఆమెను చూసి యమా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సినిమా హిందీ వెర్షన్లో ‘హేమామాలిని’ని చూసి ఆమె ఫ్యాన్స కూడా విజిల్స్ వేశారు. అప్పుడే కాదు... ఇప్పటికీ హీరోయిన్ డ్యూయెల్ రోల్ చేస్తే ఫ్యాన్స ఎగబడి చూస్తున్నారు. అందుకే అడపా దడపా హీరోయిన్లు ద్విపాత్రాభినయం చేస్తూనే ఉంటారు. ‘ఓం శాంతి ఓం’లో దీపికా పదుకొనె, ‘చారులత’లో ప్రియమణి, ‘తను వెడ్స మను రిటర్న్స’లో కంగనా, రీసెంట్గా విడుదలైన ‘మయూరి’లో నయనతార తదితరులు రెండేసి డిఫరెంట్ పాత్రల్లో కనిపించి మురిపించారు. ప్రియాంకాచోప్రా అయితే త్వరలో రానున్న ఓ సినిమాలో పదమూడు పాత్రలు చేస్తోందట. ఎవరు ఎన్ని పాత్రలు వేసినా, ఎంత బాగా చేసినా... డ్యూయెల్ రోల్ చేయడంలో శ్రీదేవి స్టైలే వేరు. పలు భాషల్లో పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఆమె... ‘చాల్బాజ్’ అనే హిందీ చిత్రంతో డ్యూయెల్ రోల్‌కి ఓ స్టాండర్డని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు! -
బ్యూటిఫుల్ దెయ్యాలు
గ్లామర్ పాయింట్ మతి చెదరగొట్టే అందంతో ముగ్ధ మురిపించినప్పుడు... ముద్దుగా అందాల రాక్షసి అని సంబోధిస్తుంటారు. కానీ ఆ అందాల భరిణె రక్తం తాగే రక్కసి అని తెలిస్తే ఎలా ఉంటుంది! గుండె అదిరిపోతుంది. ప్రాణం బెదిరిపోతుంది. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అలాగే అయ్యింది. హీరోయిన్ అంటే అందంతో మురిపించాలి. స్టెప్పులతో అలరించాలి. కానీ అందుకు భిన్నంగా చేసిన హీరోయిన్లు ఉన్నారు. కలువ రేకుల్లాంటి కన్నుల్లో క్రూరత్వాన్ని పలికించారు. అందమైన చిరునవ్వులతో అలరించేవాళ్లు కాస్తా వికటాట్టహాసాలతో హడలెత్తించారు. హీరోని ప్రాణంగా ప్రేమించే ప్రేయసిగా కనిపించాల్సింది పోయి పిశాచాలుగా నటించి ప్రాణాలు పిండేశారు. ఆ బ్యూటిఫుల్ దెయ్యాలే వీళ్లు. మంచిదైనా, చెడ్డదైనా... దెయ్యం దెయ్యమే. అదంటే అందరికీ భయమే. అందుకే ఈ గ్లామరస్ హీరోయిన్లు దెయ్యాల పాత్రలు వేస్తే ప్రేక్షకులు గుండె చిక్కబట్టుకుని చూశారు. ముచ్చెమటలు పట్టించిన వారి అద్భుత నటనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయారు! -
హీరోని ఆకట్టుకోడానికి ‘జీరో’ అక్కర్లేదు!
గ్లామర్ పాయింట్ హీరోయిన్ ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు మొదటగా వచ్చే సమాధానం స్లిమ్‌గా, నాజూగ్గా ఉండాలి అని. స్లిమ్‌నెస్ అన్నదే హీరోయిన్‌కి కొలమానమా? కానే కాదు అని ఎప్పుడో నిరూపణ అయ్యింది. ఒకనాడు సావిత్రి, మీనాకుమారి వంటి నటీమణులు ప్రతిభ ముందు పర్సనాలిటీ పని చేయదని ప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఖుష్బూ, సౌందర్య లాంటి తారామణులు ఫిగరుతో సంబంధం లేకుండా తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ యంగ్ యాక్ట్రెస్‌లు కూడా అదే మార్గంలో పయనిస్తున్నారు. సినిమాలో హీరోని ఆకట్టుకోడానికి జీరో సైజు అవసరం లేదు, ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించడానికి స్లిమ్‌గానే ఉండక్కర్లేదు అని బాక్సాఫీసులు బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. వాళ్లకున్న క్రేజ్ మనకు తెలుసు కాబట్టి ఒప్పుకోక తప్పుతుందా! -
బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్
గ్లామర్ పాయింట్ అందమైన కథానాయికలు బ్లాక్‌డ్రెస్‌లో కనిపిస్తే మైండ్ బ్లాకైపోతుంది! ‘బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మైండ్ బ్లాక్ కావడం ఏమిటి’ అనుకోవద్దు. ‘బ్లాక్’కు అధికారిక, అనధికారిక నిర్వచనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఆణిముత్యాలు కూడా లేకపోలేదు. మచ్చుకు ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ ఏన్ డిమ్యూల్ మీస్తర్ బ్లాక్ కలర్ గురించి ఏమందో తెలుసా... ‘బ్లాక్ ఈజ్ పోయెటిక్’ అంది. ఇప్పుడు చెప్పండి మరి... బ్లాక్‌డ్రెస్ వేసుకున్న తారలను చూస్తే మది కవిత్వం చెప్పదూ!! ఇక ఫ్లాష్బ్లాక్లోకి వెళితే... ఇంగ్లండ్ రాజు ప్రిన్స్ ఆల్బర్ట్ 1861లో చనిపోయాడు. అప్పటి నుంచి ఆయన భార్య క్వీన్ విక్టోరియా రోజూ బ్లాక్‌డ్రెస్ వేసుకోవడం ప్రారంభించింది. ఆమె ఏ ఉద్దేశంతో బ్లాక్‌డ్రెస్ వేసుకోవడం ఆరంభించినా అదొక ఫ్యాషన్‌గా మారిపోయింది. ముఖ్యంగా మన అందాల తారల వస్త్ర సౌందర్యానికి నలుపు చిరునామా అయిపోయింది! -
ఫిల్మ్ అకాడమీల కన్న... పెద్దల మాట మిన్న!
గ్లామర్ పాయింట్ ‘ది న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ’లో నటనలో శిక్షణ తీసుకుంది ప్రముఖ డెరైక్టర్ ఇంద్ర కుమార్ కుమార్తె శ్వేత కుమార్. ఆరోజుల్ని ఒకసారి గుర్తుకు తెస్తే- ‘‘ఏమాటకామాట చెప్పుకోవాలి. అక్కడ నేర్చుకున్నదానికంటే పెద్దల సలహాల నుంచి నేర్చుకుందే ఎక్కువ’’ అంటుంది ఆమె. ‘సూపర్ నాని’ సినిమాలో భాగంగా రేఖ, రణ్‌ధీర్ కపూర్‌లాంటి సీనియర్లతో పని చేసే అవకాశం వచ్చింది శ్వేతకు. ఆ సమయంలో నటనకు సంబంధించి వారెన్నో సలహాలు ఇచ్చారట. ముఖ్యంగా ఎమోషనల్ సీన్‌ను ఎలా పండించాలి అనేదాని గురించి బోలెడు టిప్పులు ఇచ్చారట. పర్ఫెక్షన్ కోసం రేఖ పడే తపన శ్వేతను ఆకట్టుకుంది. వీలైనప్పుడల్లా అరుణా ఇరానీ సలహాలు కూడా అడుగుతుంది శ్వేత. ఒకసారి ఇరానీ ‘‘మీ నాన్న డెరైక్టర్ కాబట్టి సినిమాల్లోకి రావాలనుకోకు. నటన మీద పాషన్ ఉంటే మాత్రమే వచ్చేయ్’’ అన్నారట. శ్వేత మాటల్లో కనిపించే అంకితభావం చూస్తుంటే ఆమె ఆషామాషీగా సినిమా రంగంలోకి రాలేదనే విషయం అర్థమవుతుంది. శ్వేతకు ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలో పనిచేసే అవకాశం రావాలని ఆశిద్దాం.