బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్
గ్లామర్ పాయింట్
అందమైన కథానాయికలు బ్లాక్‌డ్రెస్‌లో కనిపిస్తే మైండ్ బ్లాకైపోతుంది! ‘బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మైండ్ బ్లాక్ కావడం ఏమిటి’ అనుకోవద్దు. ‘బ్లాక్’కు అధికారిక, అనధికారిక నిర్వచనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఆణిముత్యాలు కూడా లేకపోలేదు. మచ్చుకు ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ ఏన్ డిమ్యూల్ మీస్తర్ బ్లాక్ కలర్ గురించి ఏమందో తెలుసా... ‘బ్లాక్ ఈజ్ పోయెటిక్’ అంది. ఇప్పుడు చెప్పండి మరి... బ్లాక్‌డ్రెస్ వేసుకున్న తారలను చూస్తే మది కవిత్వం చెప్పదూ!! ఇక ఫ్లాష్‌బ్లాక్‌లోకి వెళితే... ఇంగ్లండ్ రాజు ప్రిన్స్ ఆల్బర్ట్ 1861లో చనిపోయాడు.
అప్పటి నుంచి ఆయన భార్య క్వీన్ విక్టోరియా రోజూ బ్లాక్‌డ్రెస్ వేసుకోవడం ప్రారంభించింది. ఆమె ఏ ఉద్దేశంతో బ్లాక్‌డ్రెస్ వేసుకోవడం ఆరంభించినా అదొక ఫ్యాషన్‌గా మారిపోయింది. ముఖ్యంగా మన అందాల తారల వస్త్ర సౌందర్యానికి నలుపు చిరునామా అయిపోయింది!