Young Actress
-
డ్రగ్ కేసులో ఇరికిస్తామని బెదిరింపులు, యువ నటి ఆత్మహత్య
ఫేక్ ఎన్సీబీ అధికారుల రైడింగ్‌తో కలత చెందిన యువ నటి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటు చేసుకుంది. డ్రగ్ కేసులో ఇరికిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 20న నటి స్నేహితులతో కలిసి హుక్కా పార్లర్‌కు వెళ్లింది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎన్సీబీ అధికారులమంటూ రైడ్ చేశారు. కేసు పెట్టకూడదంటే 40 లక్షల రూపాయలివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. దీంతో సదరు నటి అతికష్టం మీద రూ.20 లక్షలు సర్దగలిగింది. అయినప్పటికీ వారు మరింత డబ్బు కావాలని వేధింపులకు గురి చేశారు. ఈ వ్యవహారంతో కలత చెందిన నటి డిసెంబర్ 23న తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైడ్ జరిపింది ఫేక్ ఎన్సీబీ అధికారులని గుర్తించారు. ఎన్సీబీ అధికారులమని చెప్పుకున్న నిందితులు సూరజ్ పర్దేశి, ప్రవీణ్ వాలింబేను అరెస్ట్ చేశారు. అయితే ఆమె దగ్గర డబ్బు గుంజడానికి నటి స్నేహితులే ఆమెను పార్టీకి తీసుకెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్సీబీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీబీ అధికారులు ప్రైవేట్ ఆర్మీని సృష్టించి సెలబ్రిటీలను పనిగట్టుకుని వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. అయితే అధికారులు మాత్రం నటి ఆత్మహత్యలో అరెస్టయిన ఇద్దరు వ్యక్తులతో ఎన్సీబీకి ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. -
యూట్యూబ్ నటికి వేధింపులు..
సాక్షి, హైదరాబాద్: తన డ్రైవర్ తనని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ యూట్యూబ్ యువనటి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. డ్రగ్స్‌కు బానిసగా మారిన డ్రైవర్ ఇబ్రహిం.. డబ్బు కోసం తనని వేధిస్తున్నట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల తను కేరళ వెళ్లినప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. చదవండి: వ్యాక్సిన్ : వరంగల్‌లో హెల్త్ వర్కర్ మృతి! -
హీరోని ఆకట్టుకోడానికి ‘జీరో’ అక్కర్లేదు!
గ్లామర్ పాయింట్ హీరోయిన్ ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు మొదటగా వచ్చే సమాధానం స్లిమ్‌గా, నాజూగ్గా ఉండాలి అని. స్లిమ్‌నెస్ అన్నదే హీరోయిన్‌కి కొలమానమా? కానే కాదు అని ఎప్పుడో నిరూపణ అయ్యింది. ఒకనాడు సావిత్రి, మీనాకుమారి వంటి నటీమణులు ప్రతిభ ముందు పర్సనాలిటీ పని చేయదని ప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఖుష్బూ, సౌందర్య లాంటి తారామణులు ఫిగరుతో సంబంధం లేకుండా తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ యంగ్ యాక్ట్రెస్‌లు కూడా అదే మార్గంలో పయనిస్తున్నారు. సినిమాలో హీరోని ఆకట్టుకోడానికి జీరో సైజు అవసరం లేదు, ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించడానికి స్లిమ్‌గానే ఉండక్కర్లేదు అని బాక్సాఫీసులు బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. వాళ్లకున్న క్రేజ్ మనకు తెలుసు కాబట్టి ఒప్పుకోక తప్పుతుందా!