
సాక్షి, హైదరాబాద్: తన డ్రైవర్ తనని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ యూట్యూబ్ యువనటి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. డ్రగ్స్‌కు బానిసగా మారిన డ్రైవర్ ఇబ్రహిం.. డబ్బు కోసం తనని వేధిస్తున్నట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల తను కేరళ వెళ్లినప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. చదవండి: వ్యాక్సిన్ : వరంగల్‌లో హెల్త్ వర్కర్ మృతి!