Banjara Hills police stations
-
యూట్యూబ్ నటికి వేధింపులు..
సాక్షి, హైదరాబాద్: తన డ్రైవర్ తనని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ యూట్యూబ్ యువనటి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. డ్రగ్స్‌కు బానిసగా మారిన డ్రైవర్ ఇబ్రహిం.. డబ్బు కోసం తనని వేధిస్తున్నట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల తను కేరళ వెళ్లినప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. చదవండి: వ్యాక్సిన్ : వరంగల్‌లో హెల్త్ వర్కర్ మృతి! -
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై క్రిమినల్ కేసు
బంజారాహిల్స్: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్లగణేశ్ పంపించారని ప్రముఖ సినీనిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ) జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండ్లగణేశ్, అతడి అనుచరుడు కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 420, 448, 506, 109 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ రోడ్ నంబరు 82లో ఉండే ప్రసాద్ వి. పొట్లూరి ఇంటికి శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురు ఆగంతకులు ఇంట్లోకి చొరబడి అసభ్యపదజాలంతో దూషిస్తూ బండ్లగణేశ్‌తో ఉన్న ఆర్థిక వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై తన కార్యాలయంలో మాట్లాడుకుందామని చెబుతుండగానే తనపట్ల దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. టెంపర్ సినిమా నిర్మాణం కోసం బండ్ల గణేశ్ 2013లో తన వద్దకు వచ్చాడని, అందుకోసం రూ.30 కోట్లు రుణం ఇవ్వాల్సిందిగా అడిగాడని చెప్పారు. దీనికి తాను ఒప్పుకుని ఆమేరకు ఒప్పందం చేసుకుని రుణం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇందులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించి మిగిలిన రూ.7 కోట్లను మాత్రం ఇవ్వకుండా ఇప్పటి వరకూ నెట్టుకొచ్చాడన్నారు. 3 నెలల్లో ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఇవ్వకపోగా ఆమొత్తానికి సంబంధించి ఇచ్చిన పోస్టుడేటెడ్ చెక్కులు కూడా బౌన్స్ అయినట్లు తెలిపారు. తనపై హత్యాయత్నం చేయాలనుకున్నారని, తనకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాల్సిందిగా పీవీపీ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా బండ్లగణేశ్ శుక్రవారం రాత్రి పీవీపీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా అనంతరం ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపారు. -
దానంపై భూ ఆక్రమణ కేసు
హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో భూ ఆక్రమణ, బెదిరింపు కేసు లు నమోదయ్యాయి. తన స్థలాన్ని నాగేందర్ కాజేయడానికి యత్నిస్తున్నాడంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన కొండపల్లి హైమావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్-2లోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రిని ఆనుకొని కొండపల్లి హైమావతి అనే మహిళకు 889 గజాల స్థలం ఉంది. వారం క్రితం ఈ స్థలంలో రూమ్ కట్టేందుకు ఆమె అల్లుడు జయేందర్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా దానం ప్రధాన అనుచరుడు సూరి, హేమా చౌదరి అనే వురో మహిళ, సోమాజిగూడ కార్పొరేటర్ ఎలిగల మహేష్ యాదవ్ వచ్చి ఈ స్థలం అన్నదని, ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారు. దానం ఇంటికి వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని హెచ్చరించారు. మరోమారు సూరి, ఆయన అనుచరులు స్థలం వద్దకు వచ్చి అన్న మాట్లాడతారంటూ ఫోన్ కలిపి ఇచ్చారు. ఫోన్లోనే జయేందర్రెడ్డిని దానం హెచ్చరించాడు. అసభ్యకరంగా దూషించారు. ఖాళీ చేసి వెళ్లకపోతే ఖతం చేస్తానంటూ బెదిరించారు. ఈ స్థలంలో నిర్మాణం ఎలా కడతావో చూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోకపోతే అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితులు తనకు నాగేందర్ నుంచి ప్రాణహాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో వెంటనే నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిని ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు దానంతోపాటు సోమాజిగూడ కార్పొరేటర్ మహేష్ యాదవ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన మరుసటి రోజు కూడా నాగేందర్ మరోసారి జయేందర్రెడ్డికి ఫోన్ చేసి నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా అంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారం కోర్టులు, పోలీసులతో కాదని కేవలం తనతో సెటిల్మెంట్ చేసుకుంటేనే కొంతవరకు లాభపడతావంటూ హితవు పలికారు. ఇదిలా ఉండగా బాధిత మహిళ కొండపల్లి హైమావతి పీపుల్స్ వార్ అగ్ర నాయకుడు కొండపల్లి సీతారామయ్యకు స్వయానా మరదలు, ఏపీ డైరీ మాజీ చైర్మన్ చంద్రమౌళి రెడ్డి భార్య కావడం విశేషం.