ఆయనతో నటించడం మా అదృష్టం: ‘ఓరి దేవుడా’ హీరోయిన్స్‌ | Ori Devuda Heroine Interesting Comments At Press Meet | Sakshi
Sakshi News home page

Ori Devuda Heroines: ఆయనతో నటించడం మా అదృష్టం: ‘ఓరి దేవుడా’ హీరోయిన్స్‌

Published Wed, Oct 19 2022 8:50 AM | Last Updated on Wed, Oct 19 2022 8:50 AM

Ori Devuda Heroine Interesting Comments At Press Meet - Sakshi

‘‘ఓరి దేవుడా’ చిత్రకథ, కథనాలు ప్రేక్షకుల మనసులకు దగ్గరగా ఉంటాయి. ఫ్యామిలీ, యూత్‌.. ఇలా అన్ని వర్గాల ఆడియన్స్‌ని మా చిత్రం ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అని హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశా భట్‌ అన్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా వెంకటేష్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహించారు. మిథిలా పాల్కర్, ఆశా భట్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వంశీ కాక ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. పీవీపీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా మిథిలా పాల్కర్, ఆశాభట్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఓ మై కడవులే’ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి, ఆ చిత్రాన్ని ‘ఓరి దేవుడా’గా రీమేక్‌ చేయడం జరిగింది. ఇందులోని ట్విస్టులు ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. అశ్వత్‌ అద్భుతంగా తెరకెక్కించారు. వెంకటేశ్‌ సార్‌ లాంటి లెజెండ్‌తో నటించడం మా అదృష్టం. ఆయన నటించడం మా సినిమాకి చాలా ప్లస్‌ అవుతుంది. విశ్వక్‌ సేన్‌ అంకితభావంతో పనిచేస్తారు. ఆయనతో నటించడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. 

దీపావళికి కుటుంబమంతా కలిసి మా సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు. ఇక నటి మిథిలా పాల్కార్‌ మాట్లాడుతూ.. ‘నేను నటించిన ‘లిటిల్‌ థింగ్స్‌’ వెబ్‌ సిరీస్‌ని రామ్‌ చరణ్‌లాంటి స్టార్‌ హీరో, ఆయన సతీమణి ఉపాసనగారు చూడటం ఆనందంగా ఉంది. నా నటనకి ఫ్యాన్‌ అంటూ ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్‌ వేడుకలో రామ్‌చరణ్‌గారు మాట్లాడటంతో నా ఆనందానికి అవధుల్లేవు’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement