యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశాభట్ కథానాయికలుగా జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా..లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా వస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న థియేటర్లలో కనువిందు చేయనుంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి మెగా హీరో రామ్‌చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
(చదవండి: లవ్వే లేని లవ్ మ్యారేజ్.. కామెడీతో అదరగొడుతున్న 'ఓరి దేవుడా' ట్రైలర్)
వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'మనం సినిమాను ఎంత ప్రేమిస్తామో తెలుసు. మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఈ మూవీకి వంశీ కాక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయనకు ఆల్ ది బెస్ట్. వెంకటేశ్ అన్నా.. మీ కోసమైనా నేను ఈ సినిమా చూస్తా. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వక్‌సేన్ పేరు తెలియని వాళ్లు ఉండరు. అతి తక్కువ సమయంలో గల్లీగల్లీకి ఆయన ఫ్యాన్స్‌ను సంపాదించారు. ఒక్కసారి మాటిస్తే విశ్వక్ కూడా నిలబడతాడన్న పేరుంది. అతని వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్. ఈ సినిమా కుడా ఉప్పెన మూవీలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'రామ్ చరణ్ అన్న సినీ ప్రయాణం నాకెంతో స్ఫూర్తి. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వటం చిన్న విషయం కాదు. నేను అన్నయ్యను చూశాకే క్రమశిక్షణ నేర్చుకున్నా. ఈ క్షణాల్ని నేను మర్చిపోలేను. దర్శకుడు అశ్వత్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్, డీఓపీ విద్ధు ఇండియాలోనే టాప్ లిస్ట్‌లో నిలుస్తారు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే చిత్రమిది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment