అంతర్జాల ప్రపంచంలో ‘ఫాదర్స్ డే’ సందడి మూడు నాలుగు రోజుల క్రితమే మొదలైంది. ‘ఫాదర్స్ డే రోజు వినాల్సిన బాలీవుడ్ ఫేమస్ పాటలు’ ‘తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న కథానాయికలు’ ‘ఫాదర్స్ డే రోజు తండ్రితో కలిసి చూడాల్సిన సినిమాలు’... ఇలా ఎన్నో విషయాలపై నెటిజనుల పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి.
వాటిలో కొన్ని... ‘ఫాదర్స్ డే’ రోజు వినాల్సిన పాటల విషయానికి వస్తే... అమీర్‌ఖాన్ సినిమా ‘ఖయామత్ సే ఖయామత్’లోని ‘పప్పా కెహ్తహై’... అక్షయ్ కుమార్ ‘బాస్’ సినిమాలోని ‘పితా సే హై నామ్ తేరా’ ‘యారా దిల్ దారా’ సినిమాలోని ‘హమారా పప్పా ఔర్ హమ్’... ఆలియాభట్ ‘రాజీ’ సినిమాలోని ‘దిల్‌బరో’... ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి.
ఇక తెలుగు పాటల విషయానికి వస్తే ‘నాన్నా నీ మనసే వెన్నా’ ఆల్‌టైమ్ ఫేవరెట్. జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో...’ పాట, చిరంజీవి ‘డాడీ’ సినిమాలోని ‘గుమ్మాడి గుమ్మాడీ’, విక్రమ్ ‘నాన్న’ సినిమాలో ‘పప్పా పప్పా’ కమల్‌హాసన్ ‘ఇంద్రుడు–చంద్రుడు’లో ‘లాలిజో లాలీజో చెప్పవే పాపాయి’... మొదలైన పాటలు ‘ఫాదర్స్ డే’ రోజు వినిపించే పాటలు.
తండ్రీ కూతుళ్లు బంధాన్ని ప్రతిబింబించే ‘దంగల్’ ‘అంగ్రేజీ మీడియం’ ‘పికు’ ‘తప్పడ్’... మొదలైన బాలీవుడ్ సినిమాల గురించి కొందరు పోస్ట్‌లు పెట్టారు.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న అందాల కథానాయికలు శ్రద్ధా కపూర్, అనన్య పాండే, కరీనా కపూర్, ఆలియాభట్, సోనాక్షి సిన్హా, సోనాల్ కపూర్... మొదలైన వారి గురించి ప్రశంసాపూర్వకంగా రాశారు.
నాన్న నాకు ప్రపంచంలోని అత్యంత విలువైన కానుక ఇచ్చాడు. ఆ కానుక పేరు... ప్రేమ.
– సోనాల్ కపూర్
నువ్వు ఎంచుకున్న మార్గం, నువ్వు ఏర్పర్చుకున్న అభిప్రాయం సరిౖయెనది అనిపిస్తే ఎప్పుడూ వెనకడుగు వేయవద్దు... అని నాన్న చెప్పే మాట నాకు చాలా ఇష్టం.
– సోనాక్షి సిన్హా
స్కూల్లో డ్రాప్ చేసిన, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మెచ్చుకున్న, సరదాగా నాతో ఆడుకున్న నాన్నతో నా ప్రతీ జ్ఞాపకం అపురూపం.
– సుహానా ఖాన్
బాగా కష్టడాలి. మంచి ఫలితాన్ని ఆశించాలి. ఓటమికి చేరువ అవుతున్నాను... అనే భయంలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు... అని నాన్న తరచు
చెప్పేవారు.
– అనన్య పాండే
నాకు నచ్చిన ఇద్దరు పిల్లలు... మా నాన్న రణŠ ధీర్‌కపూర్, మా అబ్బాయి జె అలీఖాన్!
– కరీనా కపూర్
మా నాన్న చాలా భిన్నంగా ఆలోచిస్తారు. వాటిని అర్థం చేసుకుంటే జీవితం లోతుపాతులు అర్థం అవుతాయి. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది తెలుస్తుంది. పిల్లలను సినిమాలు, పార్క్‌లకు తీసుకెళ్లడమే తండ్రి బాధ్యత అని ఆయన అనుకోలేదు. చిన్న చిన్న మాటలతోనే గొప్ప విషయాలు చెప్పడం ఆయన ప్రత్యేకత. ‘యూ మస్ట్ ఫెయిల్’ అని ఏ తండ్రి అయినా అంటాడా? మా నాన్న అనేవాడు! ఒక్క ఫెయిల్యూర్ ఎన్ని పాఠాలు నేర్పుతుంది!!
– ఆలియా భట్
Comments
Please login to add a commentAdd a comment