Bollywood And Tollywood Actresses Upcoming Action Movies, Deets Inside - Sakshi
Sakshi News home page

Actresses Action Movies: గ్లామర్‌తో యాక్షన్‌ చేసేందుకు వస్తున్న ముద్దుగుమ్మలు..

Published Tue, Jul 26 2022 7:22 AM | Last Updated on Tue, Jul 26 2022 9:17 AM

Bollywood Tollywood Actress Action In Upcoming Movies - Sakshi

Bollywood Actress Action With Glamour In Upcoming Movies: బాలీవుడ్‌లో యాక్షన్‌ రోల్స్‌ చేయడానికి ట్రైనింగ్‌ తీసుకున్న హీరోయిన్లలో దీపికా పదుకోన్‌ ఒకరు. ఆల్రెడీ కొన్ని యాక్షన్‌ సినిమాలు చేసిన దీపికా నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి దీపిక ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ అయింది. గన్‌ పట్టుకుని తీక్షణంగా దీపికా గురిపెట్టినట్లు ఈ పోస్టర్‌ను చూస్తే అర్థం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. 

మరోవైపు పోలీస్‌ అండ్‌ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు తీయడంలో మంచి అనుభవం ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్‌ శెట్టి ప్రస్తుతం ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, వివేక్‌ ఒబెరాయ్, అలనాటి పాపులర్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఇందులో శిల్పాది పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ రోల్‌. ఈ రోల్‌ కోసం గన్‌ను ఫుల్‌గా లోడ్‌ చేసి వెబ్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టారు శిల్పా. ఇక 2017లో మిస్‌ వరల్డ్‌గా నిలిచిన మానుషీ చిల్లర్‌ ‘పృథ్వీరాజ్‌’ అనే పీరియాడికల్‌ ఫిల్మ్‌తో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా వెండితెరపై యాక్షన్‌ టర్న్‌ తీసుకున్నారు. జాన్‌ అబ్రహాం హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘టెహ్రాన్‌’లో మానుషీ ఓ యాక్షన్‌ రోల్‌ చేస్తున్నారు.

ఇంకోవైపు దివంగత ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ ‘గుడ్‌లక్‌ జెర్రీ’ అనే సినిమా కోసం గన్‌ పట్టు కున్నారు. సిద్ధార్థ్‌ సేన్‌ గుప్తా దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లింగ్‌ యాక్షన్‌ మూవీలో కామెడీ టచ్‌ ఉంది. ఈ చిత్రం ఈ నెల 29 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మరో హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌ ‘ది ఘోస్ట్‌’ ఫిల్మ్‌లో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. అక్టోబరు 5న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 

వీరే కాదు.. ‘టైగర్‌ ఫ్రాంచైజీ’లోని ‘టైగర్‌ 3’లో చిత్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌కి దీటుగా కత్రినా కైఫ్‌ యాక్షన్‌ రోల్‌ చేస్తున్నారు. అలాగే అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో కత్రినా ఓ లేడీ సూపర్‌ హీరో సినిమా అంగీకరించారు. టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటిస్తున్న ‘హీరో పంతి 2’ కోసం తారా సుతారియా గన్‌ పట్టుకున్నారు. ఈ చిత్రానికి అహ్మద్‌ఖాన్‌ దర్శకుడు. అలాగే టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా చేస్తున్న మరో ఫిల్మ్‌ ‘గణపత్‌’లో కృతీసనన్‌ యాక్షన్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ యాక్షన్‌ జాబితాలో ప్రియాంకా చోప్రా (హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘మ్యాట్రిక్స్‌ 4’), దిశా పటానీ వంటి వారు కూడా ఉన్నారు.  అంటే.. ఈ ముద్దుగుమ్మలందరూ తమ గ్లామర్‌తోపాటు యాక్షన్‌ను పండించనున్నారని తెలుస్తోంది. మరి వీరి యాక్షన్‌ ఆ సినిమాలకు ఏమాత్రం ప్లస్‌ కానుందో, లేదా హైలెట్‌ అవనుందో వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement