
హీరోయిన్లకు సమంత స్ఫూర్తి
మంచి, మానవత్వం అనేవి స్వతహాగానే ఉంటాయి.లేని పక్షంలో ఇతరుల నుంచి స్ఫూర్తి పొంది అయినా ప్రవర్తించవచ్చు.
మంచి, మానవత్వం అనేవి స్వతహాగానే ఉంటాయి.లేని పక్షంలో ఇతరుల నుంచి స్ఫూర్తి పొంది అయినా ప్రవర్తించవచ్చు. వీటిలో మొదటి కోవకు చెందిన నటి సమంత సహ నటీమణులకు స్ఫూర్తినిచ్చే దిశగా అడుగులు వేస్తున్నారనిపిస్తోంది. విజయ్, అజిత్ లాంటి నటులు ప్రతి చిత్ర షూటింగ్ గుమ్మిడికాయ కొట్టే సమయంలో యూనిట్ సభ్యులందరికీ బిరియానీ విందు ఇవ్వడం, లేక ప్రయోజన కరమైన బహుమతులను అందించడం లాంటి చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.
ఇటీవల ఇలాంటి సంప్రదాయాన్నే నటుడు ధనుష్, విశాల్ అమలు పరుస్తున్నారు.చిత్ర యూనిట్ సభ్యులకు బంగారు గొలుసులు, డాలర్లు అందించారు.అయితే ఇలా కథానాయికలేవరూ చేయడం చూడలేదు. తాజాగా నటి సమంత అలాంటి సత్సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నది గమనార్హం.ధనుష్‌కు జంటగా వీఐపీ2 చిత్రంలో నటించిన సమంత ఆ చిత్ర షూటింగ్ చివరి రోజున యూనిట్ సభ్యులందరికీ తలా ఐదు వేలు చొప్పున్న నగదు బహుమతిని అందించి వారికి అభిమాన పాత్రురాలయ్యారు.అంతేకాదు సహ నటీమణులకు స్పూర్తిగా నిలిచారు.
సమంత తన హేర్‌డ్రస్సర్, మేకప్‌మన్, ఇతర సహాయకులనూ చక్కగా చూసుకుంటారని, వారి అవసరాలను గుర్తెరిగి సాయం చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారనే పేరుంది.అంతే కాదు తన అందానికి కారణం హేర్‌డ్రెస్సర్, మేకప్‌మన్‌లే కారణం అని బహిరంగంగానే ప్రకటించి ఆ క్రెడిడ్‌ను కూడా వారికే ఇచ్చిన డేరింగ్ నటి సమంత. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్‌తో తాజా చిత్రంలో డ్యూయెట్లు పాడుతున్నారు. విక్రమ్ సరసన నటించిన పత్తుండ్రదుకుళ్, ధనుష్‌కు జంటగా నటించిన వీఐపీ2 చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి.