Mrunal Thakur Shocking Comments On Heroines Remuneration - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: హీరోయిన్ల రెమ్యునరేషన్‌పై మృణాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Sun, Dec 18 2022 12:47 PM | Last Updated on Sun, Dec 18 2022 2:19 PM

Mrunal Thakur Shocking Comments On Heroines Remuneration - Sakshi

మృణాల్‌ ఠాకుర్‌.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. హిందీ టీవీ సీరియల్స్‌ ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన మృణాల్‌ పలు సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించింది. అయితే సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఆమె ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ మరాఠి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఆమె పిప్పా అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన మృణాల్‌ హీరోయిన్ల రెమ్యునరేషన్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

చదవండి: సితార అన్‌ప్లాన్డ్‌ బేబీ: నమ్రత షాకింగ్‌ కామెంట్స్‌

హీరోయిన్లు పారితోషికం చెప్పడానికి సందేహించకూడదని.. డిమాండ్‌ చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుల్లో నటీనటులకు ఉన్న గుర్తింపు, పాపులారిటిని బట్టి ఎంత పారితోషికం ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. అయితే చాలా మంది హీరోయిన్స్ తాము కోరుకున్న రెమ్యునరేషన్‌ని డిమాండ్ చేసే విషయంలో తెలియని అయమోమయంలో ఉంటారు. అది మంచిది కాదు. రెమ్యునరే,న్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో అర్థమవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం మృణాల్ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. 

చదవండి: సావిత్రి గురించి షాకింగ్‌ విషయం చెప్పిన సీనియర్‌ నటి ఝాన్సీ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement