డ్రెస్సు మూరెడు... రేటు బారెడు! | short dress ... Costly rate! | Sakshi
Sakshi News home page

డ్రెస్సు మూరెడు... రేటు బారెడు!

Published Sun, Jun 5 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

డ్రెస్సు మూరెడు... రేటు బారెడు!

డ్రెస్సు మూరెడు... రేటు బారెడు!

‘చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప..’ అనే పాట గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో చిన్న గౌనులో...

‘చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప..’ అనే పాట గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో చిన్న గౌనులో కనువిందు చేసిన రమ్యకృష్ణను కూడా అంత సులువుగా మర్చిపోలేం. ‘అదిరేటి డ్రెస్సు మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ పాట గుర్తు రాగానే వయ్యారంగా నర్తించిన ఊర్మిళ కళ్ల ముందు మెదలకుండా ఉండదు. ఇక్కడ పేర్కొన్న రెండు డ్రెస్సులూ సినిమాల్లోవి. నేటి తరం నాయికలు కూడా ఇలా సినిమాల్లో అదిరేటి డ్రెస్సులతో అదరగొడుతున్నారు.

అయితే విడిగా కూడా ఇలాంటి కాస్ట్యూమ్స్‌లోనే దర్శనాలిచ్చి మతులు పోగొడుతున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలకు తారలు వస్తున్న తీరు చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదని చూసేవాళ్లు అంటున్నారు. ఎంతైనా మన కథానాయికల మనసు చాలా విశాలమైనదనీ, ఏదీ పెద్దగా దాచుకోరనీ జోకేసేవాళ్లూ ఉన్నారనుకోండి. ప్రతిదానికీ బడ్జెట్ చెక్ చేసుకునేవాళ్లు మాత్రం ‘ఎంతైనా అమ్మాయిలకు రూపాయంటే చాలా జాగ్రత్త.

బట్టల ఖర్చు తక్కువే’  అంటారు. కానీ, పెద్ద గౌనుకి ఎంత అవుతుందో చిన్న గౌనుకీ అంతే ఖర్చవుతుందట! చిన్న డ్రెస్సు మొత్తం మూడు మీటర్లు ఉండదేమో.. రేటు మాత్రం వేలల్లోనే! పొడవాటి డ్రెస్సులకి 70వేల నుంచి లక్ష వరకూ ఖర్చు పెడుతుంటే.. పొట్టి డ్రెస్సులకు కాస్తంత తక్కువగా అంతే ఖర్చుపెడుతున్నారు. అందాల తారలు వేసుకునే డ్రెస్సుల ఖరీదు ఓ సామాన్య ఉద్యోగి నెల జీతంకన్నా కొంచెం ఎక్కువే అంటే అతిశయోక్తి కాదు.

ఇంత ఖర్చుపెట్టడం అవసరమే. ఎందుకంటే ఉండేది గ్లామర్ ఫీల్డ్‌లో. ఎప్పుడూ గ్లామరస్‌గా కనిపించాలి. లేకపోతే ‘ఎందుకోగానీ ఆ హీరోయిన్ ఈ మధ్య అంత బాగుండట్లేదు’ అని స్టాంప్ వేసేస్తారు. అలా అనిపించుకోవడంకన్నా ఉన్న అందం ఎంతో కొంత కనపడేలా డ్రెస్సులేసుకోవడం మేలు. అందుకే తారలందరూ సినిమాల్లోనే కాకుండా విడిగా కూడా రెచ్చిపోతున్నారు. పైగా.. ఆ మధ్య ఎండలు దంచేశాయ్ కదా. అందుకే గత రెండు, మూడు నెలల్లో తారలందరూ దాదాపు పొట్టి గౌన్లూ, మినీ స్కర్టులే బెస్ట్ అనుకున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నట్లుగా దర్శనమిచ్చారు. అదిరేటి డ్రెస్సులు వీళ్లేస్తే చూసేవాళ్లకి దడ పుట్టకుండా ఉంటుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement