రూ.50కి అశ్లీల వీడియో! | - | Sakshi
Sakshi News home page

రూ.50కి అశ్లీల వీడియో!

Published Sat, Oct 28 2023 7:32 AM | Last Updated on Sat, Oct 28 2023 11:13 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఓ బాలికకు చెందిన మార్ఫింగ్‌ అశ్లీల వీడియోను ట్విట్టర్‌ ద్వారా వైరల్‌ చేస్తూ, రూ.50కి విక్రయిస్తున్న వ్యక్తిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగర షీ–టీమ్స్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, ఈ తరహా వీడియోలు కలిగిన ట్విట్టర్‌ వినియోగదారులను మందలించామని డీసీపీ కవిత శుక్రవారం పేర్కొన్నారు.

భూక్యా రమేష్‌కి ట్విట్టర్‌లో అకౌంట్‌ ఉంది. ఇతగాడు మార్ఫింగ్‌ ద్వారా రూపొందించిన ఓ బాలికకు చెందిన అశ్లీల వీడియోను వైరల్‌ చేస్తున్నాడు. పలువురు ట్విట్టర్‌ ఖాతాదారులను సంప్రదించి రూ.50 వసూలు చేస్తూ ఆ వీడియో వారికి షేర్‌ చేస్తున్నాడు. ఈ విషయం గుర్తించిన సిటీ షీ–టీమ్స్‌ అధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement