వాట్సాప్లో మోదీ మార్ఫింగ్ ఫొటోలు
ఆగ్రా: ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా వాట్సాప్ ద్వారా విరుద్ధమైన పోస్టింగ్ చేసినందుకు ఇద్దరు యువకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసులు పెట్టారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు వివరణ ఇస్తూ..
'ఇండియన్ పీనల్ కోడ్ లోని 153వ సెక్షన్ (బీ) ప్రకారం ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అభ్యంతరకరంగా మోదీ ఫొటో మార్పిడి చేసి పంపించిన వ్యక్తిని అరెస్టు చేశాం' అని చెప్పారు. సోమవారం ఆజాద్ ఖాన్ అనే యువకుడు ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను అభ్యంతరకరంగా మార్పిండి చేసి తన గ్రూప్ లో పోస్ట్ చేశాడు. ఈ విషయం బీజేపీ కార్యకర్తలకు తెలియడంతో వారు కేసు పెట్టారు.