చెన్నై,తిరువొత్తియూరు: వందకు పైబడిన మహిళల ఫొటోలను అసభ్యంగా చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పెరియ కాంచీపురం మల్లిగై వీధికి చెందిన మహ్మద్ గయాస్ (27) శ్రీ పెరంబదూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. అతను చెన్నై ట్రిప్లికేన్‌లో అద్దె ఇంటిలో వివాహం చేసుకోకుండా సుమతి అనే యువతితో కలసి వుంటున్నాడు.
ఈ క్రమంలో సుమతితో కలిసి పలు కార్యక్రమాలకు హాజరైన గయాస్ మహిళలకు తెలియకుండా ఫోటోలు తీసి వాటిని అసభ్యంగా చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఓ యువతి ఫేస్‌బుక్ చూస్తున్న సమయంలో తన ఫొటో అసభ్యంగా చిత్రీకరించడం చూసి దిగ్భ్రాంతి చెందింది. దీనిపై చెన్నై వెస్టుజోన్ జాయింట్ కమిషనర్ విజయకుమార్‌కు ఫిర్యాదు చేసింది. దీనినై విచారణ చేసిన పోలీసులు మహ్మద్ గయాస్‌ను అరెస్టు చేశారు. అతని సెల్‌ఫోన్‌లో తనిఖీ చేయగా 50 ఏళ్లలోపు 100 మందికి పైబడిన మహిళా ఫొటోలను అసభ్యంగా చిత్రీకరించినట్లు గుర్తించారు. అతను తన తల్లి, పిన్ని, బంధువులు ఫోటోలు సైతం అసభ్యంగా చిత్రీకరించాడు. గయాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment