dead lizard
-
మెక్ డొనాల్డ్స్ నిర్వాకం: కూల్ డ్రింకులో చచ్చిన బల్లి..చివరికి
అహ్మదాబాద్: కూల్ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలున్నాయని అనేక రిపోర్టులు చెబుతున్నా పట్టించుకోని శీతల పానీయాల ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. తాజాగా అహ్మదాబాద్‌లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. భార్గవ జోషి అనే వ్యక్తి ఆర్డర్ చేసిన కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. బల్లిని చూసి షాకైన భార్గవ జోషి రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి, ఇందేంటని నిలదీశాడు. అయితే ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న సిబ్బంది డబ్బులు వాపస్ ఇస్తాం అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంత కడుపు మండి మున్సిపల్ అధికారులకు చేరేలా చేశాడు. ఈ సందర్భంగా తాను వీడియోను పోలీసులకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు భార్గవ జోషి. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై అహ్మదాబాద్ పురపాలక శాఖ స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రెస్టారెంట్ అవుట్ లెట్‌కు సీల్ వేశారు. కూల్ డ్రింకు శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కి పంపించినట్టు వెల్లడించారు. Here is video of this incidents happens with me...@McDonalds pic.twitter.com/UiUsaqjVn0 — Bhargav joshi (@Bhargav21001250) May 21, 2022 -
సంక్రాంతి కానుకలో మృతిచెందిన బల్లి.. ఫిర్యాదుదారుడిపైనే కేసు, మనస్తాపంతో
సాకక్షి, చెన్నై: సంక్రాంతి కానుకలో బల్లి మృతిచెందిందని ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి తిరుత్తణిలో చోటు చేసుకుంది. శరవణ పుష్కరిణి సమీపంలోని చౌక దుకాణంలో అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త నాథన్ (65) నాలుగు రోజుల కిందట సంక్రాంతి కానుకలు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి పరిశీలించగా చింతపండులో మృతి చెందిన బల్లి ఉన్నట్లు గుర్తించి చౌక దుకాణం సేల్స్ మ్యాన్‌కు ఫిర్యాదు చేశాడు. చదవండి: యువతులను వంచించి వికృతానందం సేల్స్‌మ్యాన్ శరవణన్ పట్టించుకోకపోవడంతో మీడియాకు తెలిపాడు. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు. మనస్తాపం చెందిన అతని కుమారుడు కుప్పుస్వామి (35) మంగళవారం సాయంత్రం కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీనికి నిరసనగా అన్నాడీఎంకే నేతలు రాస్తారోకో చేపట్టారు. చదవండి: Viral Video: ఏంటా దూకుడు!... బ్రేక్ వేసుండకపోతే పరిస్థితి.... -
వెజ్ బిర్యానీలో ‘బల్లి ’
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలు, ఆహారంపై విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన కాగ్ రిపోర్ట్ అనుగుణంగా రైల్వేల బాగోతం మరోసారి బట్ట బయలైంది. ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన భోజనంలో చనిపోయిన బల్లి కనిపించడం ఆందోళన రేపింది. పూర్వా ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్న భక్తుల బృందానికి మంగళవారం ఈ చేదు అనుభవం ఎదురైంది. పార్లమెంటులో సమర్పించిన కాగ్ నివేదిక నేపథ్యంలో ప్రయాణికుల ఆందోళన, ఆశ్చర్యం ఇంకా చల్లారకముందే రైళ్ళలో ఆహారం మానవ వినియోగానికి తగదన్న కఠోర సత్యం మరోసారి రుజువైంది. ఝార్ఖండ్ నుంచి ఉత్తర ప్రదేశ్‌కు ప్రయాణిస్తున్న యాత్రికులు బృందం లక్నో కు సమీపంలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. దీంట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో బెంబేలెత్తిపోయారు. అంతేకాదు దీన్ని తిన్న ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఆ భోజనాన్ని బయటికి విసిరి పారేశారు తప్ప ఎలాంటి స్పందన లేదు. అటు రైల్వే టికెట్ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. దీంతో విసుగెత్తిన ఒక ప్రయాణికుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కొంతమంది సీనియర్ అధికారులు వెంటనే వారికి కొన్ని మందులు అందించారు. సీనియర్ రైల్వే అధికారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణీకుల అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఇక్కడికి రావడానికి ముందే, వైద్యుల సహాయంతో మెడిసిన్స్ సూచించినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి, కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పారు. అలాగే దీనికి సబంధించి మంత్రిత్వశాఖకు ఒక నివేదిక కూడా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. కాగా రైళ్ళలో, రైల్వే స్టేషన్లలోని కేటరింగ్ యూనిట్లలో పరిశుభ్రతను పాటించడం లేదని కాగ్ మండిపడింది. ఈ ఆహారం మానవ వినియోగానికి పనికిరానిదని, చాలా అనాగ్య పరిస్థితులలో, కలుషితమైన నీటితో వండుతారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చిన సంగతి తెలిసిందే. -
మెక్‌డోనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్లో బల్లి!
ఆకలి వేస్తోందంటే ఇంట్లో రెండు దోశలు వేసుకుని తినడం పాత మాట. సరదాగా అలా బయటకు వెల్లి మెక్‌డోనాల్డ్స్‌లో బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం నేటి బాట. అయితే ఇలాగే ఆశగా ఫ్రెంచ్ ఫ్రైస్ తిందామని వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతాలోని ఈఎం బైపాస్ ఏరియాలో గల మెక్‌డోనాల్డ్స్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పాటు చచ్చిన బల్లి ఒకటి వాళ్ల ప్లేట్లో దర్శనమిచ్చింది. ప్రియాంకా మొయిత్రా అనే మహిళ తన కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు.. ఆమె కూతురికి ఈ బల్లి కనిపించింది. తన నాలుగేళ్ల కూతురి పుట్టినరోజని తామంతా కలిసి రెస్టారెంటుకు వెళ్లామని, తీరా అక్కడ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి తింటుండగా బల్లి కనపడటంతో తనకు వెంటనే వాంతులు వచ్చాయని ఆమె చెప్పారు. వెంటనే ఆ విషయాన్ని మేనేజర్‌కు చెప్పగా ఆయన తమకు క్షమాపణలు చెప్పి, వాటిని తీసేసి కొత్తగా మళ్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తామని చెప్పారని ప్రియాంక అన్నారు. అయితే ప్రస్తుతం గర్భవతి అయిన ప్రియాంకకు కాసేపటి తర్వాత కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడంతో తన కూతురితో పాటు గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందారు. వెంటనే ముందుగా ప్లేటులో ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పాటు చచ్చిన బల్లి ఫొటోను తీసుకున్నారు. ఆ ఫొటోతో కలిపి ఫూల్ బగన్ పోలీసు స్టేషన్లో మెక్డోనాల్డ్స్పై ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని, ఇలాంటి విషాహారం తినడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అన్న విషయం ప్రజలకు తెలియాలని ప్రియాంక అన్నారు.