ఎంపెసా కస్టమర్లకు వొడాఫోన్ అవుట్లెట్లలో నగదు | Demonestisation: Vodafone announces M-Pesa app for cash withdrawal | Sakshi
Sakshi News home page

ఎంపెసా కస్టమర్లకు వొడాఫోన్ అవుట్లెట్లలో నగదు

Published Fri, Nov 25 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

ఎంపెసా కస్టమర్లకు వొడాఫోన్ అవుట్లెట్లలో నగదు

ఎంపెసా కస్టమర్లకు వొడాఫోన్ అవుట్లెట్లలో నగదు

న్యూఢిల్లీ: నగదు కొరత నేపథ్యంలో... వొడాఫోన్ ఎంపెసా కస్టమర్లు సంస్థకు చెందిన రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా నగదు పొందవచ్చని ఆ సంస్థ గురువారం తెలియజేసింది. నగదు కోసం వొడాఫోన్ కస్టమర్లు బ్యాంకు ఏటీఎంల వద్ద క్యూలలో నించువోవాల్సిన అవసరం లేదని సూచించింది. బ్యాంకు శాఖలకు సమాంతరంగా దేశవ్యాప్తంగా తాము 1,20,000 ఎంపెసా అవుట్‌లెట్లను సిద్ధం చేసినట్టు పేర్కొంది. కస్టమర్లు వీటిలో ఏదేనీ అవుట్‌లెట్‌కు వెళ్లి క్యాష్ అవుట్ సదుపాయం ద్వారా తమ డిజిటల్ వాలెట్ నుంచి నగదును వెనక్కి తీసుకోవచ్చని ఎంపెసా అధిపతి సురేష్ సేతి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం కస్టమర్లు తమ వెంట గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలని సూచించారు. అందుబాటును బట్టి నగదు పొందే సౌలభ్యం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement